ఖమ్మంలో ఉద్యమకారుల దీక్ష

Follow

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారులు సోమవారం శాంతియుత దీక్ష చేపట్టారు. దీక్షా శిబిరాన్ని సీనియర్ ఉద్యమకారుడు అర్వపల్లి విద్యాసాగర్, సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు సింగు నరసింహారావు ప్రారంభించారు.
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కేవీ కృష్ణారావు మాట్లాడుతూ ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సింగు నరసింహారావు, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఇటిక్యాల రామకృష్ణ సంఘీభావం ప్రకటించారు. పొలిటికల్ జేఏసీ జిల్లా మాజీ కన్వీనర్ కూరపాటి రంగరాజు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
-ఖమ్మం
నిరంతర విద్యుత్తు సరఫరా చేయాలని ధర్నా
నిరంతర విద్యుత్తు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలంలోని రైతులు సోమవారం కాగజ్‌నగర్ విద్యుత్తు డివిజన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బురదగూడ, వంజీరి, సీఆర్‌నగర్, అంకుసాపూర్, నార్లపూర్, మహాజన్‌గూడ గ్రామాలకు మూడురోజులుగా విద్యుత్తుసరఫరా లేక పొలాలకు నీళ్లివ్వలేక పోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.
స్పందించిన ఎస్‌ఈ శేషరావు వెంటనే విద్యుత్తును పునరుద్ధరించారు. ఏదైనా విద్యుత్తు సమస్య తలెత్తితే టోల్ ఫ్రీ నం : 1912ను సంప్రదించాలని కోరారు.
-కాగజ్‌నగర్