గడ్డిమందు ఇచ్చి… లైంగికదాడి.. హత్య!

Follow

- తెలిసిన మహిళను నమ్మించి ఆర్‌ఎంపీ డాక్టర్ పైశాచికం
- రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టుబడిన నిందితుడు
గుర్రంపోడ్, జూన్ 30: ఓ మహిళ.. తమ గ్రామానికి చెందినవాడే కదా అని.. ఓ ఆర్‌ఎంపీ డాక్టర్‌ను నమ్మింది. సాయం కోసం ఫోన్ చేసింది. అదే ఆసరాగా చేసుకున్న ఆ దుర్మార్గుడు.. ఆమెకు గడ్డి మందు ఇంజెక్షన్స్ ఇచ్చి, మళ్లీ నీళ్లలో కలిపి తాగించాడు. ఆ తర్వాత లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెను హత్య చేశాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా జూ నూతులలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా జూనూతుల కు చెందిన మహిళ, ఆమె భర్త, పిల్లలతో కలిసి మిర్యాలగూడెంలో నివసిస్తున్నది. జూనూతులలో అత్తమ్మ నివసిస్తున్నది. ఆ దివారం అత్తమ్మను చూసేందుకు సదరు మహిళ మిర్యాలగూడెం నుంచి జూనూతలకు బయల్దేరింది.
మార్గమధ్యలో మల్లేపల్లిలో బస్సు దిగింది. అప్పటికే రాత్రి ఆలస్యం కావడంతో జూనూతులకు చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్ మహేశ్‌కు ఫోన్ చేసి.. ఆ విషయం భర్తకు తెలిపింది. మల్లేపల్లికి వచ్చిన మహేశ్.. మహిళను కారులో ఎక్కించుకుని జూనూతుల బయల్దేరాడు. గ్రామానికి వచ్చినప్పుడు ఆ మహిళ.. బలం ఇంజెక్షన్ తీసుకుంటుంది. ఎప్పటిలాగానే ఇంజెక్షన్ ఇస్తున్నట్టు నమ్మించి, గడ్డి మందును 10సార్లు ఇంజెక్షన్ చేశాడు. అపస్మారక స్థితికి చేరుకున్న మహిళకు గడ్డి మందును నీళ్లలో కలిపి తాగించాడు.
ఆ తర్వాత ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మహిళ చనిపోతుందని భావించిన మహేశ్.. రాత్రి ఒంటి గంట సమయంలో జూనూతుల సమీపంలోని కాచారం రోడ్డులో వదిలేయడానికి ప్రయత్నించాడు. అటుగా గస్తీ వచ్చిన పోలీసులు గమనించి రెడ్‌హ్యాండె గా మహేశ్‌ను అరెస్ట్ చేశారు. బాధితురాలిని హైదరాబాద్‌లోని దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి భర్త ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
ఓ మహిళ.. తమ గ్రామానికి చెందినవాడే కదా అని.. ఓ ఆర్‌ఎంపీ డాక్టర్‌ను నమ్మింది. సాయం కోసం ఫోన్ చేసింది. అదే ఆసరాగా చేసుకున్న ఆ దుర్మార్గుడు.. ఆమెకు గడ్డి మందు ఇంజెక్షన్స్ ఇచ్చి, మళ్లీ నీళ్లలో కలిపి తాగించాడు.