గన్స్.. బాంబ్స్.. ఇప్పుడు డ్రగ్స్.. గాజాలోకి ప్రాణాంతక నార్కోటిక్స్ కలిపిన ఆహారం ఇజ్రాయెల్‌పై ఆరోపణలు

Follow

గాజా, జూన్ 29 : పాలస్తీనాపై బాంబులు, తుపాకులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ మరో అస్ర్తాన్ని ప్రయోగిస్తున్నదని తెలుస్తున్నది. పాలస్తీనా ప్రజలకు విషాహారం సరఫరా చేస్తూ ప్రాణాలు తీస్తున్నదని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. యుద్ధంలో నిరాశ్రయులై ఆకలితో అలమటిస్తున్న పాలస్తీనా ప్రజలకు అమెరికా-ఇజ్రాయెల్ సహాయ కేంద్రాల వద్ద ఆహార పంపిణీ జరుగుతున్నది. అయితే ఇక్కడ పంపిణీ చేసిన పిండిలో ఆక్సికోడోన్ మాత్రలు లభించడం కలకలం రేపుతున్నది. ఇది ఇజ్రాయెల్ కుట్ర అని గాజా ప్రభుత్వ మీడియా అధికారులు ఆరోపించారు. ఆక్సికోడోన్ చాలా తీవ్రమైన మత్తుపదార్థమని, ఇది వ్యసనంగా, ప్రాణాంతకంగా మారి, పరస్పర దాడులకు దారి తీస్తుందని, తద్వారా పాలస్తీనా సమాజం సామూహికంగా విచ్ఛిన్నమయ్యేలా కుట్ర పన్నారని తెలిపారు.
యుద్ధనేరాలు, జాతి విధ్వంసం అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇది హేయమైన చర్య అని గాజాలోని మానవహక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. పాలస్తీనాలోని పునరావాస, సహాయ కేంద్రాల వద్ద నిరాయుధులైన ప్రజలను ఇజ్రాయెల్ సైన్యం పొట్టనపెట్టుకుందని మానవహక్కుల సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. మే నెల నుంచి ఇలా 500 మంది అమాయక ప్రజలను హతమార్చారని ఆవేదన వ్యక్తంచేశారు. మరోవైపు గాజాలో యుద్ధనేరాలకు సంబంధించి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, మాజీ రక్షణమంత్రి యోవ్ గ్యాలంట్‌కు అరెస్ట్ వారంట్ జారీ చేసింది.
పాలస్తీనాపై బాంబులు, తుపాకులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ మరో అస్ర్తాన్ని ప్రయోగిస్తున్నదని తెలుస్తున్నది. పాలస్తీనా ప్రజలకు విషాహారం సరఫరా చేస్తూ ప్రాణాలు తీస్తున్నదని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. యుద్ధంలో నిరాశ్రయులై ఆకలితో అలమటిస్తున్న పాలస్తీనా ప్రజలకు అమెరికా-ఇజ్రాయెల్ సహాయ కేంద్రాల వద్ద ఆహార పంపిణీ జరుగుతున్నది.