గ్యాప్ ఇవ్వల.. అదే వచ్చింది అంటూ మరల బరిలోకి దిగిన బ్యూటీస్

Follow
భీమ్లా నాయక్.. బింబిసార.. సార్.. విరూపాక్ష లాంటి సినిమాలతో తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్న సంయుక్త మీనన్.. రెండేళ్లుగా కనిపించట్లేదు. అలాగని కెరీర్ అయిపోయిందేమో అనుకుంటే పొరపాటే.
ప్రస్తుతం ఈ భామ చేతిలో అరడజన్ సినిమాలున్నాయి.. అఖండ 2, స్వయంభు, బెంజ్, నారినారి నడుమ మురారి, హైందవంతో పాటు పూరీ, విజయ్ సేతుపతి సినిమాలోనూ నటిస్తున్నారు.
రెండేళ్ల గ్యాప్ తీసుకున్నా.. మరో రెండేళ్ల వరకు తానొక్కరే కనిపించేలా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు సంయుక్త. మరోవైపు భాగ్యశ్రీ బోర్సే కూడా అంతే. మిస్టర్ బచ్చన్ తర్వాత ఈమెకు భారీ గ్యాప్ వచ్చింది.
ఏడాదిగా మాయం అయినా.. రాబోయే ఏడాదంతా భాగ్య దర్శనమే కానుంది. విజయ్ దేవరకొండ కింగ్డమ్తో పాటు దుల్కర్ సల్మాన్ కాంతా, రామ్ ఆంధ్రా కింగ్ తాలూక సినిమాలు చేస్తున్నారు ఈ బ్యూటీ.
డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్ కూడా అంతే. తెలుగులో మూడేళ్ల కింద అల్లూరి సినిమా చేసిన ఈమె.. ఇప్పుడు వరస ఛాన్సులు అందుకుంటున్నారు. విశ్వక్ సేన్ ఫంకీలో నటిస్తున్నారీమే. అలాగే శ్రీలీల కూడా ఈ మధ్య చిన్న బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్తో పాటు రవితేజ మాస్ జాతర, అఖిల్ లెనిన్ సినిమాలతో రానున్నారు.
కనిపించట్లేదు ఖాళీగా ఉన్నారేమో..? గ్యాప్ వచ్చింది.. కెరీర్ ఖతమ్ అయిపోయిందేమో అనుకుంటున్నారా..? అదే స్పీడ్.. అదే జోరు.. కాకపోతే మధ్యలో చిన్న కమర్షియల్ బ్రేక్ ఇచ్చాం అంతే అంటున్నారు కొందరు బ్యూటీస్. మన ఇండస్ట్రీలో అలాంటి సైలెంట్ కిల్లర్స్ ఎక్కువైపోయారు. టాలీవుడ్లో ఆ స్థాయిలో బిజీగా ఉన్న హీరోయిన్స్ ఎవరు..?