చలించిన మాజీ మంత్రి హరీశ్‌రావు

Follow

- భర్త కోసం రోదిస్తున్న మహిళను ఓదార్చిన బీఆర్‌ఎస్ నాయకులు
పటాన్‌చెరు రూరల్, జూన్ 30: భర్త ఆచూకీ కోసం రోదిస్తున్న మహిళను చూసి మాజీ మంత్రి హరీశ్‌రావు చలించిపోయారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన భారీ పేలుడులో కార్మికులు మృతిచెందారు. దీంతో ఆయన పరిశ్రమను సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలు, చికిత్స పొందుతున్న వారి వివరాలు, మిస్సింగ్ అయిన కార్మికుల వివరాలను ఆయన సేకరించారు.
పరిశ్రమ ఎదుట కూర్చుని రోదిస్తున్న మహిళను చూసి వివరాలు అడిగారు. తన పేరు అనితకుమారి అని, భర్త శివ్‌కుమార్ పరిశ్రమలో విధులకు వచ్చాడని తెలిపింది. ఆమెను హరీశ్‌రావు, మాజీ మంత్రి పద్మా దేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సత్యనారాయణ, క్రాంతికిరణ్, బీఆర్‌ఎస్ నేతలు ఆదర్శ్‌రెడ్డి, గడీల శ్రీకాంత్‌గౌడ్ ఓదార్చారు. ఇదే సందర్భంలో హరీశ్‌రావు పటాన్‌చెరు తహసీల్దార్ రంగారావును పిలిచి ఆమె భర్త ఆచూకీ తెలియజేసేందుకు సహాయం చేయాలని సూచించారు.
భర్త ఆచూకీ కోసం రోదిస్తున్న మహిళను చూసి మాజీ మంత్రి హరీశ్‌రావు చలించిపోయారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన భారీ పేలుడులో కార్మికులు మృతిచెందారు. దీంతో ఆయన పరిశ్రమను సందర్శించారు.