చలో పూసుగూడెం ఉద్రిక్తత.. సీతారామ నీటి కోసం బీఆర్‌ఎస్‌ ఆందోళన

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Brs Leaders
  • పూసుగూడెం వెళ్తున్న రేగా, వనమా, హరిప్రియ, మెచ్చా, రాకేశ్‌రెడ్డి అరెస్ట్‌
  • జలాలు ఇచ్చేదాకా పోరాడుతామని హెచ్చరిక
  • ఢిల్లీలో బోనమెత్తిన తెలంగాణ బిడ్డలు ఉత్సవాలు ప్రారంభించిన గవర్నర్‌

హైదరాబాద్‌, జూన్‌ 30 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలోని నివసించే తెలంగాణ బిడ్డలు బోనాల వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ భవన్‌లో లాల్‌దర్వాజ బోనాలు ఘనంగా మొదలయ్యాయి. సోమవారం వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభించారు. బోనం ఎత్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ సంసృతి, సంప్రదాయాలను దేశ రాజధానిలో చాటిచెప్పడం అభినందనీయమని కొనియాడారు.

తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ శశాంక్‌గోయల్‌ గవర్నర్‌ను సన్మానించారు. మంగళవారం ఇండియా గేట్‌ నుంచి తెలంగాణ భవన్‌ వరకు అమ్మవారి గద్దెల ఊరేగింపు, ఘటస్థాపన నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. బుధవారం పోతరాజు స్వాగతం, నృత్యాలు, బంగారు బోనం ఘట్టాలు ఉంటాయని తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి శ్రీమహంకాళి దేవాలయ కమిటీ సభ్యులు, తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఏటా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.

తెలంగాణ అభివృద్ధిపై ప్రధాని ఆరా

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీసినట్టు తెలిసింది. సోమవారంలో ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ దేశ ప్రధానిని కలిశారు. ఈసందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న వివిద రకాల అభివృద్ధి పనుల గురించి ప్రధాని మోడీ గవర్నర్‌ను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం.

​ఢిల్లీలోని నివసించే తెలంగాణ బిడ్డలు బోనాల వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ భవన్‌లో లాల్‌దర్వాజ బోనాలు ఘనంగా మొదలయ్యాయి. సోమవారం వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *