చెత్త తీసుకెళ్లే లారీలో అనుమానాస్పదంగా కనిపించిన గోనె సంచి..! తెరిచి చూడగా గుండె ఆగినంత పనైంది..

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
చెత్త తీసుకెళ్లే లారీలో అనుమానాస్పదంగా కనిపించిన గోనె సంచి..! తెరిచి చూడగా గుండె ఆగినంత పనైంది..

చెత్త తీసుకెళ్లే లారీలో ఒక మూట కనిపించింది. అనుమానం వచ్చిన స్థానికులు దాన్ని తెరిచి చూడగా.. వారి గుండె ఆగినంత పనైంది. ఆ సంచిలో ఓ మహిళ మృతదేహం బయటపడింది. బెంగళూరులో 30-35 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళ మృతదేహాన్ని ఒక సంచిలో కట్టి చెత్త లారీలో పడేశారు. ఆ మహిళ గుర్తింపు తెలియరాలేదు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం పంపామని, కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలో నిందితులు ఆటోరిక్షాలో వచ్చి ఆ సంచిని చెత్త లారీలో పడేసినట్లు కనిపిస్తోంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు హంతకులను వెతుకుతున్నారు.

చన్నమ్మనకెరె అచ్చుకట్టు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బెంగళూరు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ.. తెల్లవారుజామున 1 గంట నుంచి 3 గంటల మధ్య చెత్త లారీలో ఆ సంచిని పడేశారని చెప్పారు. “మహిళ చేతులు, మెడ కట్టేసి ఉన్నాయి. మృతదేహం గోనె సంచిలో ఉంది. BBMP సిబ్బంది మృతదేహం గురించి మాకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించి ఆ తర్వాత హత్య కేసు నమోదు చేశాం. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నాం” అని ఆయన చెప్పారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

​బెంగళూరులోని చెత్త లారీలో ఒక మహిళ మృతదేహం గోనె సంచిలో కనిపించింది. 30-35 ఏళ్ల మధ్య వయసున్న మహిళ మృతదేహం చేతులు, మెడ కట్టేసి అందులో పడేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆటోరిక్షాలో వచ్చి నిందితులు సంచిని లారీలో పడేశారని అనుమానం. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *