చెర్వుగట్టు ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

Follow

నార్కట్‌పల్లి జూన్ 30: చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని దేవాదాయ, చేనేత జౌళి శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ తెలిపారు. సోమవారం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులోని రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి తదితరులతో కలిసి సందర్శించారు. ముందుగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఈవో చాంబర్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా శైలజారామయ్యర్ మాట్లాడుతూ భవిష్యత్తు తరాలు గుర్తు చేసుకునే విధంగా మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మాణాలు చేపట్టాలన్నారు. భక్తులకు వసతి కల్పించేందుకు పనులు చేపట్టాలన్నారు. ఈ సం దర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వం చెర్వుగట్టు సమీపంలో హరిత హోటల్‌ను మంజూరు చేసిందని స్థల సేకరణకు ఎస్సీ సంక్షేమ శాఖ నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల వీరేశం, సూర్యనారాయణ మూర్తి, అశోక్ రెడ్డి, శివరాంరెడ్డి, ఓంప్రకాశ్, శ్రీనివాస్ శర్మ, నవీన్, అధికారులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.
చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని దేవాదాయ, చేనేత జౌళి శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ తెలిపారు. సోమవారం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులోని రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి తదితరులతో కలిసి సందర్శించారు.