జిల్లా ఆస్పత్రిని సందర్శించిన కలెక్టర్

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి జిల్లా కేంద్రంలోగల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, వైద్య కళాశాలను జిల్లా కలెక్టర్ హనుమంత రావు, మెడికల్ కాలేజీ మానిటరింగ్ కమిటీ సభ్యులు డీఎంఈ నరేందర్, మహేశ్వరం మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ నాగేంద్ర, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రమేష్ రెడ్డి, సూపరింటెండెంట్  వెంకటేశ్వర్లు, చిన్నా నాయక్ లతో కలసి, ప్రభుత్వ మెడికల్ కళాశాలను సందర్శించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధ్యక్షతన జి. జి.హెచ్ సూపరింటెండెంట్ ఛాంబర్ లో మెడికల్ కాలేజీ మానిటరింగ్ కమిటీ సభ్యులు డి.యం.ఈ నరేందర్, మహేశ్వరం మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ నాగేంద్ర ఆయా విభాగాల అధిపతులతో సమావేశమై అన్ని అంశాలపై కులం కుశంగా చర్చించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఒక్కో విభాగం వారీగా రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, డాక్టర్లు, సిబ్బంది ఖాళీలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఇంకనూ కొత్తగా సమకూర్చాల్సిన సదుపాయాలు తదితర వాటి గురించి కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.  వివిధ విభాగాలను సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. సేవలు, డాక్టర్లు, సిబ్బంది ఖాళీలు, అందుబాటులో  జాతీయ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) మార్గదర్శకాలకు అనుగుణంగా సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు.

ఈ నివేదికను అనుసరిస్తూ సదుపాయాల మెరుగుదల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. ఆసుపత్రి, మెడికల్ కాలేజీల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, తమ దృష్టికి తేవాలని సూచించారు.  జీజీహెచ్ ఆధ్వర్యంలో అందిస్తున్న అధునాతన వైద్య సేవల గురించి ప్రజలకు తెలిసేలా చూడాలని, తద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు పట్ల ప్రజల్లో నమ్మకం పెంపొందుతుందని సూచించారు.
వైద్య కళాశాలలో జాతీయ మెడికల్ కౌన్సిల్ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా అవసరమైన అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, తద్వారా ఎన్ఎంసీ అనుమతుల మంజూరీలో ఇబ్బందులకు ఆస్కారం ఉండదని కలెక్టర్ సూచించారు. వైద్య విద్యార్థులు సంఖ్యకు అనుగుణంగా ప్రొఫెసర్ లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, బోధనేతర సిబ్బంది ఉండాలన్నారు. ఆయా విభాగాలలో ఖాళీలు ఉంటే, వాటి వివరాలను తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు

The post జిల్లా ఆస్పత్రిని సందర్శించిన కలెక్టర్ appeared first on Navatelangana.

​నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి జిల్లా కేంద్రంలోగల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, వైద్య కళాశాలను జిల్లా కలెక్టర్ హనుమంత రావు, మెడికల్ కాలేజీ మానిటరింగ్ కమిటీ సభ్యులు డీఎంఈ నరేందర్, మహేశ్వరం మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ నాగేంద్ర, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రమేష్ రెడ్డి, సూపరింటెండెంట్  వెంకటేశ్వర్లు, చిన్నా నాయక్ లతో కలసి, ప్రభుత్వ మెడికల్ కళాశాలను సందర్శించారు. అనంతరం జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధ్యక్షతన జి. జి.హెచ్ సూపరింటెండెంట్ ఛాంబర్ లో మెడికల్ కాలేజీ
The post జిల్లా ఆస్పత్రిని సందర్శించిన కలెక్టర్ appeared first on Navatelangana. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *