జూలైలో సాధారణం కన్నా అధిక వర్షాలు.. వాతావరణ శాఖ అంచనా

Follow

న్యూఢిల్లీ: దేశంలోని చాలా ప్రాంతాల్లో జూలై నెలలో సాధారణం కన్నా అధిక స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సోమవారం సూచించింది. మధ్య భారతం, ఉత్తరాఖండ్, హర్యానాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. వరదలు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. ఈశాన్య, తూర్పు భారతంలోని చాలా ప్రాంతాల్లో, దక్షిణాదిలో చివరి ప్రాంతాల్లో సాధారణం కన్నా తక్కువ స్థాయిలో వర్షాలు కురియవచ్చునని తెలిపింది.
సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం నుంచి సాధారణం కన్నా తక్కువ స్థాయిలో ఉండవచ్చునని పేర్కొంది. ఈశాన్య, వాయువ్య, తూర్పు, దక్షిణ భారతదేశ ప్రాంతాల్లో సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చునని చెప్పింది. ఐఎమ్‌డీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. జూలై నెలలో సగటున 28 సెం.మీ. వర్షపాతం నమోదవుతుందని చెప్పారు. ఈ ఏడాది జూలైలో తెలంగాణ సహా పలు రాష్ర్టాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురియొచ్చన్నారు.
దేశంలోని చాలా ప్రాంతాల్లో జూలై నెలలో సాధారణం కన్నా అధిక స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సోమవారం సూచించింది. మధ్య భారతం, ఉత్తరాఖండ్, హర్యానాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.