జేఎన్‌యూ విద్యార్థి నజీబ్‌ అహ్మద్‌ అదృశ్యం కేసు మూసివేతకు అనుమతి

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

న్యూఢిల్లీ: ఏబీవీపీ గుండాలతో ఘర్షణ జరిగిన తరువాత రోజు నుంచి కనిపించకుండా పోయిన జేఎన్‌యూ విద్యార్థి నజీబ్‌ అహ్మద్‌ అదృశ్యం కేసును మూసివేశారు. ఈ కేసును విచారణ చేస్తున్న సీబీఐకి మూసివేయడానికి ఢిల్లీ కోర్టు సోమవారం అనుమతించింది. సీబీఐ సమర్పించిన మూసివేత నివేదికను అదనపు చీఫ్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ జ్యోతి మహేశ్వరి సోమవారం ఆమోదించారు. అలాగే ఈ కేసులో ఏదైనా ఆధారాలు దొరికితే కేసును తిరిగి ప్రారంభించడానికి సీబీఐకి జడ్జి స్వేచ్ఛ ఇచ్చారు. జేఎన్‌యూ మొదటి సంవత్సరం విద్యార్థి నజీబ్‌ అహ్మద్‌ 2016 అక్టోబర్‌ 15న అదృశ్యమయ్యారు. జేఎన్‌యూ మహి-మాండ్వి హాస్టల్‌ నుంచి అహ్మద్‌ కనిపించకుండా పోయారు. అంతకు ముందు రోజు రాత్రి ఏబీవీపీ గుండాలు అహ్మద్‌తో ఘర్షణ పడ్డారు. ఈ కేసును ముందుగా ఢిల్లీ పోలీసులు విచారణ చేశారు. తరువాత సీబీఐకి బదిలీ చేశారు. నిజానికి నజీబ్‌ అహ్మద్‌ అచూకీ కనుగొనడానికి ఎలాంటి ఆధారాలు లేవని చెబుతూ 2018 అక్టోబర్‌లోనే సీబీఐ తన దర్యాప్తును ముగించింది. ఢిల్లీ హైకోర్టు అనుమతితో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ కేసు ముగింపు నివేదికను కోర్టుకు సమర్పించింది.
కాగా, నజీబ్‌ అహ్మద్‌ తరపు న్యాయవాది గతంలోనే మాట్లాడుతూ.. ఇది ఒక రాజకీయ కేసు, సీబీఐ తన యజమానుల (కేంద్ర ప్రభుత్వం) ఒత్తిడికి లొంగిపోయిందని విమర్శించారు.

The post జేఎన్‌యూ విద్యార్థి నజీబ్‌ అహ్మద్‌ అదృశ్యం కేసు మూసివేతకు అనుమతి appeared first on Navatelangana.

​న్యూఢిల్లీ: ఏబీవీపీ గుండాలతో ఘర్షణ జరిగిన తరువాత రోజు నుంచి కనిపించకుండా పోయిన జేఎన్‌యూ విద్యార్థి నజీబ్‌ అహ్మద్‌ అదృశ్యం కేసును మూసివేశారు. ఈ కేసును విచారణ చేస్తున్న సీబీఐకి మూసివేయడానికి ఢిల్లీ కోర్టు సోమవారం అనుమతించింది. సీబీఐ సమర్పించిన మూసివేత నివేదికను అదనపు చీఫ్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ జ్యోతి మహేశ్వరి సోమవారం ఆమోదించారు. అలాగే ఈ కేసులో ఏదైనా ఆధారాలు దొరికితే కేసును తిరిగి ప్రారంభించడానికి సీబీఐకి జడ్జి స్వేచ్ఛ ఇచ్చారు. జేఎన్‌యూ మొదటి సంవత్సరం
The post జేఎన్‌యూ విద్యార్థి నజీబ్‌ అహ్మద్‌ అదృశ్యం కేసు మూసివేతకు అనుమతి appeared first on Navatelangana. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *