టైటిల్ పోరుకు నిఖత్, లవ్లీనా.. ఎలైట్ మహిళల బాక్సింగ్ టోర్నీ

Follow

హైదరాబాద్, ఆట ప్రతినిధి: స్థానిక సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వేదికగా జరుగుతున్న మహిళల ఎలైట్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ బాక్సర్లు నిఖత్ జరీన్, లవ్లీనా బొర్గోహై ఫైనల్‌కు దూసుకెళ్లారు. వీరికి తోడు నీతూ గంఘాస్, స్విటీ బూర సైతం తుది పోరుకు అర్హత సాధించారు. జాతీయ బాక్సింగ్ సమాఖ్య(బీఎఫ్‌ఐ) సహకారంతో తెలంగాణ బాక్సింగ్ అసోసియేషన్ నిర్వహిస్తున్న టోర్నీలో సోమవారం జరిగిన 51కిలోల సెమీస్ బౌట్‌లో నిఖత్.. 5-0 తేడాతో లక్ష్య (తమిళనాడు)పై అలవోక విజయం సాధించింది.
ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచిన నిఖత్ పదునైన పంచ్‌లతో ప్రత్యర్థి భరతం పట్టింది. ఏ మాత్రం అవకాశమివ్వకుండా చెలరేగుతూ కీలక పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఫైనల్లో ఆర్‌ఎస్‌పీబీ బాక్సర్ జ్యోతితో నిఖత్ తలపడుతుంది. మరోవైపు 75కిలోల సెమీస్ బౌట్‌లో లవ్లీనా బొర్గోహై..ఆర్‌ఎస్‌సీతో స్నేహ(యూపీ)ని ఓడించింది. 48కిలోల సెమీస్‌లో నీతు.. మంజురాణి (రైల్వేస్)పై, 80కిలోల సెమీస్‌లో స్విటీ 5-0తో బబితా బిస్త్(ఆల్‌ఇండియా పోలీస్)పై, అంక్షిత బొరో..5-0తో అమితకుందు(ఏఐపీ)పై గెలిచి ముందంజ వేశారు. వీరికి తోడు ప్రీతి, తను, అల్ఫియా పఠాన్ ఫైనల్లోకి ప్రవేశించారు.
స్థానిక సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వేదికగా జరుగుతున్న మహిళల ఎలైట్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ బాక్సర్లు నిఖత్ జరీన్, లవ్లీనా బొర్గోహై ఫైనల్‌కు దూసుకెళ్లారు. వీరికి తోడు నీతూ గంఘాస్, స్విటీ బూర సైతం తుది పోరుకు అర్హత సాధించారు.