ట్రంప్, మస్క్ మధ్య విభేదాలు తారస్థాయికి..సబ్సిడీలు లేకపోతే మస్క్ దక్షిణాఫ్రికాకే.. ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
Follow
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన ఓ కీలకమైన పన్నుల బిల్లు విషయంలో ఇరువురి మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. చరిత్రలోనే ఏ వ్యక్తికి దక్కనంత స్థాయిలో మస్క్ ప్రభుత్వ సబ్సిడీలు పొందారని, అవి లేకపోతే ఆయన తన వ్యాపారాన్ని మూసివేసి దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాల్సి వస్తుందని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఈ బిల్లును ఆమోదిస్తే తాను కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తానని ఎలాన్ మస్క్ హెచ్చరించడంతో అమెరికా రాజకీయాల్లో ఈ వివాదం పెను దుమారం రేపుతోంది.
మస్క్‌పై విరుచుకుపడ్డ ట్రంప్
ట్రంప్ ప్రతిపాదించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్్ణపై మస్క్ తన విమర్శలను తీవ్రతరం చేయడంతో అధ్యక్షుడు ఘాటుగా స్పందించారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ స్పందిస్తూ… ఁచరిత్రలో ఏ వ్యక్తికి దక్కనంత స్థాయిలో ఎలాన్ మస్క్ సబ్సిడీలు పొంది ఉండవచ్చు. ఆ సబ్సిడీలు లేకపోతే, బహుశా ఎలాన్ తన దుకాణాన్ని మూసివేసి దక్షిణాఫ్రికాలోని తన ఇంటికి తిరిగి వెళ్లవలసి ఉంటుంది.
ఇక రాకెట్ ప్రయోగాలు, ఉపగ్రహాలు లేదా ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి ఉండదు. దీనివల్ల మన దేశానికి భారీగా డబ్బు ఆదా అవుతుంది. బహుశా మస్క్ ప్రభుత్వ సబ్సిడీలు, కాంట్రాక్టులపై డోజ్ నిశితంగా దృష్టి పెట్టాలేమో? దీనివల్ల పెద్ద మొత్తంలో డబ్బు ఆదా చేయవచ్చు అని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
వివాదానికి కారణమైన ఈవీ రాయితీ
ట్రంప్, మస్క్‌ల మధ్య వివాదానికి ప్రధాన కారణం ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) కొనుగోలుపై ప్రస్తుతం ఉన్న 7,500 డాలర్ల పన్ను రాయితీని ఈ బిల్లు రద్దు చేస్తుందనే ఆందోళనలే. ఈ రాయితీని తొలగిస్తే ఎలక్ట్రిక్ కార్ల ధరలు గణనీయంగా పెరుగుతాయి. ఇది టెస్లా వంటి కంపెనీలకు పెద్ద దెబ్బ. ఈ నేపథ్యంలోనే మస్క్ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే, తాను ఎప్పటినుంచో ఎలక్ట్రిక్ వాహనాల తప్పనిసరి నిబంధనకు వ్యతిరేకమని ట్రంప్ స్పష్టం చేశారు. ఁఇది ఒక పనికిమాలిన నిబంధన. నా ఎన్నికల ప్రచారంలోనూ దీని గురించి నేను స్పష్టంగా చెప్పాను. ఎలక్ట్రిక్ కార్లు మంచివే, కానీ అందరూ వాటినే కొనాలని బలవంతం చేయకూడదు అని ట్రంప్ వివరించారు.
కొత్త పార్టీ పెడతానన్న మస్క్
ఒకప్పుడు ట్రంప్‌కు సన్నిహితుడిగా ఉన్న మస్క్, గత నెల రోజులుగా ఈ 4 ట్రిలియన్ డాలర్ల పన్నుల బిల్లు విషయంలో అధ్యక్షుడితో విభేదిస్తున్నారు. సోమవారం ఆయన తన విమర్శల తీవ్రతను పెంచుతూ, ఈ బిల్లు సెనేట్‌లో ఆమోదం పొందితే ఃఅమెరికా పార్టీః పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని హెచ్చరించారు. ఈ బిల్లు వల్ల దేశ జాతీయ అప్పు 3 ట్రిలియన్ డాలర్లకు పైగా పెరుగుతుందని, ఇది దేశాన్ని దివాలా తీయిస్తుందని ఆయన ఆరోపించారు.
దీనిని ఃరుణ బానిసత్వ బిల్లుః అని అభివర్ణిస్తూ, ఈ బిల్లు వల్ల దేశం అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. మనది ఇప్పుడు ఒకే పార్టీ దేశంలా మారింది. అదే పోర్కీ పిగ్ పార్టీ ఇప్పుడు ప్రజల గురించి నిజంగా పట్టించుకునే కొత్త పార్టీ రావాల్సిన సమయం వచ్చింది అని మస్క్ ట్వీట్ చేశారు.
The post ట్రంప్, మస్క్ మధ్య విభేదాలు తారస్థాయికి..సబ్సిడీలు లేకపోతే మస్క్ దక్షిణాఫ్రికాకే.. ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు appeared first on Visalaandhra.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన ఓ కీలకమైన పన్నుల బిల్లు విషయంలో ఇరువురి మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. చరిత్రలోనే ఏ వ్యక్తికి దక్కనంత స్థాయిలో మస్క్ ప్రభుత్వ సబ్సిడీలు పొందారని, అవి లేకపోతే ఆయన తన వ్యాపారాన్ని మూసివేసి దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాల్సి వస్తుందని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఈ బిల్లును ఆమోదిస్తే తాను కొత్త రాజకీయ పార్టీని
The post ట్రంప్, మస్క్ మధ్య విభేదాలు తారస్థాయికి..సబ్సిడీలు లేకపోతే మస్క్ దక్షిణాఫ్రికాకే.. ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు appeared first on Visalaandhra.