డాక్టర్ కారులో గంజాయి

Follow

వికారాబాద్, జూన్ 18 : ప్రైవేట్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ కారులో గంజాయి దొరికిన సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. వికారాబాద్ సీఐ భీమ్ కుమార్ కథనం ప్రకారం.. వికారాబాద్‌లోని అతిర ప్రైవేట్ హాస్పిటల్‌లో చిన్నపిల్లల డాక్టర్‌గా ప్రదీప్ కుమార్‌గౌడ్ పనిచేస్తున్నారు.
మంగళవారం రాత్రి వికారాబాద్‌లో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో డాక్టర్ ప్రదీప్ కార్‌ను పోలీసులు ఆపి తనిఖీ చేయగా 65 గ్రాముల రెండు ఎండు గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. దీంతో ఆ డాక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.
ప్రైవేట్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ కారులో గంజాయి దొరికిన సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. వికారాబాద్ సీఐ భీమ్ కుమార్ కథనం ప్రకారం.. వికారాబాద్‌లోని అతిర ప్రైవేట్ హాస్పిటల్‌లో చిన్నపిల్లల డాక్టర్‌గా ప్రదీప్ కుమార్‌గౌడ్ పనిచేస్తున్నారు.