డాక్టర్ రవీందర్‌రావుకు తుదివీడోలు

Follow

- అంత్యక్రియలకు హాజరైన మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్
బోయినపల్లిరూరల్, జూన్ 19 : ప్రముఖ సీనియర్ జనరల్ సర్జన్, ప్రతిమ వైద్యకళాశాల డీఎంఈ చెన్నాడి రవీందర్‌రావు అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం హైదరాబాద్‌లోని ఓ దవాఖానలో మరణించారు. అంత్యక్రియలు గురువారం ఆయన స్వగ్రామమైన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరెంలో జరిగాయి. రవీందర్‌రావు అం త్యక్రియలకు ఆయన బావ, మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు-వినోద దంపతులు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ -మాధవి దంపతులు, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, సంజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీజేపీ నాయకులు చెన్నమనేని వికాస్‌రావు, ప్రతాప రామకృష్ణ హాజరై నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కోరెంలో విషాదఛాయలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందిన రవీందర్‌రావు మరణంతో కోరెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎన్నో కుటుంబాలకు నేనున్నానని ధైర్యం చెప్పి ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపిన మహానుభావుడని గ్రామస్థులు ఆయన సేవలు కొనియాడుతూ కన్నీటిపర్యంతమయ్యారు. రవీందర్‌రావు వైద్యపరంగానే కాకుండా సమాజసేవకు తనవంతు సహాయసహకారాలు, విరాళాలు అందించారని, కోరెంలో నిరుపేదలు ఇల్లు కట్టుకోవడానికి, ప్రజాఅవసరాలకు భూవిరాళం అందజేసి గొప్ప ఔన్నత్యాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు.
ప్రముఖ సీనియర్ జనరల్ సర్జన్, ప్రతిమ వైద్యకళాశాల డీఎంఈ చెన్నాడి రవీందర్‌రావు అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం హైదరాబాద్‌లోని ఓ దవాఖానలో మరణించారు.