డిజిటల్ ముప్పును తిప్పికొట్టే సైబర్ డోమ్.. ఇజ్రాయెల్ సహకారంతో నిర్మాణానికి జర్మనీ ప్రణాళిక

Follow

బెర్లిన్: దేశంలోని మౌలిక సదుపాయాలను సైబర్ దాడుల నుంచి కాపాడుకోవడం కోసం సైబర్ డోమ్‌ను నిర్మించాలని జర్మనీ ప్రతిపాదించింది. ఇది ఇజ్రాయెల్‌లోని ఐరన్ డోమ్ వంటిదే. అయితే, సైబర్ డోమ్ డిజిటల్ రంగంపై దృష్టి పెడుతుంది. ఇది దృఢమైన, బహుళ అంచెల సైబర్ కవచం. డిజిటల్ ముప్పు నుంచి, ముఖ్యంగా ప్రభుత్వాల మద్దతుతో జరిగే డిజిటల్ దాడుల నుంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను పరిరక్షిస్తుంది.
జర్మన్ మంత్రి అలెగ్జాండర్ డొబ్రింట్ ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం, జర్మనీ, ఇజ్రాయెల్ సంయుక్తంగా సైబర్ రిసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తాయి. ఇజ్రాయెల్, జర్మనీ నిఘా సంస్థలు మొస్సాద్, బీఎన్‌డీల మధ్య సహకారాన్ని పెంచుకుంటాయి.
దేశంలోని మౌలిక సదుపాయాలను సైబర్ దాడుల నుంచి కాపాడుకోవడం కోసం సైబర్ డోమ్‌ను నిర్మించాలని జర్మనీ ప్రతిపాదించింది. ఇది ఇజ్రాయెల్‌లోని ఐరన్ డోమ్ వంటిదే. అయితే, సైబర్ డోమ్ డిజిటల్ రంగంపై దృష్టి పెడుతుంది.