తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే..

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Brs Leaders
  • చట్టపరమైన చర్యలు తప్పవు
  • ‘మహా న్యూస్‌ టీవీ’కి బీఆర్‌ఎస్‌ నాయకుల స్పష్టీకరణ
  • ఇల్లెందు పట్టణంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన

ఇల్లెందు, జూన్‌ 29: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విషయంలో కొన్ని రోజులుగా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్న మహా టీవీ న్యూస్‌ ఛానల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ ఇల్లెందు నాయకులు డిమాండ్‌ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు పట్టణ కొత్త బస్టాండ్‌ సెంటర్‌లో బీఆర్‌ఎస్‌ ఉద్యమ నాయకుడు దిండిగాల రాజేందర్‌ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కలిసి ఆదివారం నల్లబ్యాడ్జీలు ధరించి మహా న్యూస్‌ ఛానల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ని వెంటనే విడుదల చేయాలని, మహాన్యూస్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు దిండిగాల రాజేందర్‌, సీనియర్‌ నాయకుడు సిలివేరి సత్యనారాయణ, టీబీజీకేస్‌ నాయకుడు ఎస్‌.రంగనాథ్‌ మాట్లాడుతూ.. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని కొందరు నాయకులతో చేతులు కలిపిన మహా టీవీ.. బీఆర్‌ఎస్‌ పార్టీపైనా, పార్టీ కీలక నేతలపైనా అడ్డగోలుగా అసత్య వార్తలను ప్రసారం చేయడం సిగ్గుమాలిన చర్య అన్నారు. అలాగే మహా టీవీ న్యూస్‌ ఛానల్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో తప్పుడు థంబ్‌ నెయిల్స్‌ పెట్టి బీఆర్‌ఎస్‌ పార్టీ కీలక నాయకులపై వ్యక్తిగత దూషణలు, అవమానకరమైన కథనాలను సృష్టించడం నీచమైన చర్యగా అభివర్ణించారు.

ఆంధ్రా పత్రికలు, టీవీల టార్గెట్‌ కేవలం కేసీఆర్‌ ఫ్యామిలీ మాత్రమేనని.. అందుకే బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులకు అప్రతిష్ట తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా రూపొందించిన తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్‌ నాయకులు జేకే శ్రీను, అబ్దుల్‌నబీ, కొక్కు సరిత, రాజేష్‌, హరికృష్ణ, హరిప్రసాద్‌, మహేందర్‌, డేరంగుల పోశం, తోటకూరి శ్రీకాంత్‌, రాజేష్‌, చాంద్‌పాషా, శివ, రామ్‌లాల్‌పాసి, రవి, లలిత్‌పాసి, రవికాంత్‌, సత్యనారాయణ, ముత్తయ్య, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.

​ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విషయంలో కొన్ని రోజులుగా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్న మహా టీవీ న్యూస్‌ ఛానల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ ఇల్లెందు నాయకులు డిమాండ్‌ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు పట్టణ కొత్త బస్టాండ్‌ సెంటర్‌లో బీఆర్‌ఎస్‌ ఉద్యమ నాయకుడు దిండిగాల రాజేందర్‌ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కలిసి ఆదివారం నల్లబ్యాడ్జీలు ధరించి మహా న్యూస్‌ ఛానల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *