తారక్ కోసం పంథా మార్చిన నీల్?

Follow

ప్రశాంత్‌నీల్ ‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీ, సలార్ చిత్రాల్లో యాక్షన్ తప్ప రొమాన్స్ అస్సలు కనిపించదు. అయితే.. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్‌తో చేస్తున్న ‘డ్రాగన్'(వర్కింగ్ టైటిల్)లో మాత్రం గత చిత్రాలను మించిన యాక్షన్‌తోపాటు రొమాన్స్‌ని కూడా జత చేశారట. ఎన్టీఆర్ అద్భుతమైన డ్యాన్సర్. ఆయన సినిమాల్లో డ్యాన్సులు లేకుండా కేవలం యాక్షనే అంటే ఫ్యాన్స్ ఒప్పుకోరు. అందుకే.. తారక్ కోసం తన పంథాను మార్చుకున్నారట ప్రశాంత్‌నీల్. రీసెంట్‌గా హైదరాబాద్ ఆర్‌ఎఫ్‌సీలో ఓ పాటను కూడా చిత్రీకరించారట.
ఈ పాట సినిమాలో చాలా కీలకమైన సన్నివేశంలో వస్తుందని, ఈ పాటలోని ఎమోషన్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతుందని మేకర్స్ చెబుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ సలహా మేరకు స్క్రిప్ట్‌లో కూడా కీలకమైన మార్పులు జరిగాయట. 1960ల్లో జరిగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీమేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జూన్ 25న సినిమా విడుదల కానుంది.
ప్రశాంత్‌నీల్ ‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీ, సలార్ చిత్రాల్లో యాక్షన్ తప్ప రొమాన్స్ అస్సలు కనిపించదు. అయితే.. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్‌తో చేస్తున్న ‘డ్రాగన్'(వర్కింగ్ టైటిల్)లో మాత్రం గత చిత్రాలను మించిన యాక్షన్‌తోపాటు రొమాన్స్‌ని కూడా జత చేశారట. ఎన్టీఆర్ అద్భుతమైన డ్యాన్సర్.