థాయిలాండ్‌లో ఆందోళనలు

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

– ప్రధాని రాజీనామాకు డిమాండ్‌
బ్యాంకాక్‌:
ప్రముఖ పర్యాటక దేశం థాయిలాండ్‌లో నిరసనలు హోరెత్తాయి.ఆ దేశ ప్రధాని పెతాంగ్‌టార్న్‌ షిినవత్రా రాజీనామా కోరుతూ లక్షలాది థాయి ప్రజలు శనివారం నాడు రోడ్డెక్కారు. కంబోడియా మాజీ ప్రధాని హున్‌సేన్‌ జరిపిన ఫోన్‌ సంభాషణ లీక్‌ కావడంతో ప్రజలు ఆగ్రహించారు.బ్యాంకాక్‌లోని విక్టరీ మాన్యుమెంట్‌ వద్ద నిరసనకారులు జాతీయ జెండాలు, బ్యానర్‌లతో రోడ్లను ఆక్రమించారు.ఈ ర్యాలీలో ప్రజలు భారీగా పాల్గోని, ప్రధాని రాజీనామా చేయాలని నినదించారు. థాయిలాండ్‌, కంబోడియా మధ్య సరిహద్దు వివాదాలు దీర్ఘకాలంగా కొనసాగుతున్నాయి. 1962లో ఐసీజే తీర్పు ప్రకారం, ప్రేV్‌ా విహార్‌ ఆలయం ఉన్న వివాదాస్పద ప్రాంతం కంబోడియాకు చెందుతుందని కోర్టు తీర్పు ఇచ్చింది. 2011లో అక్కడ ఘర్షణలు చెలరేగిన నేపధ్యంలో 2013లో మరోసారి ఆ తీర్పును యుఎన్‌ కోర్టు ధృవీకరించింది.
ఫోన్‌కాల్‌ లీక్‌ వివాదం
మే 28న ఇరు దేశాల సరిహద్దులోని వివాదాస్పద ప్రాంతంలో ఘర్షణలు సంభవించి ఒక కంబోడియన్‌ సైనికుడు మరణించాడు. ఈ ఘటన రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ నెల15న పెతాంగ్‌టార్న్‌ , హన్‌సెన్‌ల మధ్య ఫోన్‌ సంభాషణలు లీక్‌ అయ్యాయి. థారు ఆర్మీ జనరల్‌ను కించపరిచేవిదంగా అందులోని వాఖ్యలున్నాయని, ఇది థాయిలాండ్‌ను, సైన్యాన్ని అవమానించడమేనని నిరసనకారులు ఆరోపించారు. ఈ నిరసనలో థారు రాజవంశ విధేయుల సంస్థ యెల్లో షర్ట్స్‌ సభ్యులు పాల్గోన్నారు.ఈ ఫోన్‌ కాల్‌ లీక్‌ కావడంతో థాయిలాండ్‌ ప్రభుత్వ రాజ్యాంగ కోర్టు, జాతీయ అవినీతి నిరోధక సంస్థ దర్యాప్తు చేస్తున్నాయి. ఈ వివాదం రాజకీయ సంక్షోభానికి దారి తీసింది. పెతాంగ్‌టార్న్‌ సంకీర్ణ ప్రభుత్వంలో పెద్ద భాగస్వామి భుమ్‌జైతాయి పార్టీ తన మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో 10 పార్టీల సంకీర్ణ ప్రభుత్వం 255 సీట్లతో స్వల్ప ఆధిక్యంతో ప్రభుత్వాన్ని నడుపుతుంది. ఇది త్వరలోనే కూలిపోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

The post థాయిలాండ్‌లో ఆందోళనలు appeared first on Navatelangana.

​– ప్రధాని రాజీనామాకు డిమాండ్‌బ్యాంకాక్‌: ప్రముఖ పర్యాటక దేశం థాయిలాండ్‌లో నిరసనలు హోరెత్తాయి.ఆ దేశ ప్రధాని పెతాంగ్‌టార్న్‌ షిినవత్రా రాజీనామా కోరుతూ లక్షలాది థాయి ప్రజలు శనివారం నాడు రోడ్డెక్కారు. కంబోడియా మాజీ ప్రధాని హున్‌సేన్‌ జరిపిన ఫోన్‌ సంభాషణ లీక్‌ కావడంతో ప్రజలు ఆగ్రహించారు.బ్యాంకాక్‌లోని విక్టరీ మాన్యుమెంట్‌ వద్ద నిరసనకారులు జాతీయ జెండాలు, బ్యానర్‌లతో రోడ్లను ఆక్రమించారు.ఈ ర్యాలీలో ప్రజలు భారీగా పాల్గోని, ప్రధాని రాజీనామా చేయాలని నినదించారు. థాయిలాండ్‌, కంబోడియా మధ్య సరిహద్దు వివాదాలు
The post థాయిలాండ్‌లో ఆందోళనలు appeared first on Navatelangana. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *