ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్.. సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళనలు

Follow

- ఆదిలాబాద్ కలెక్టర్‌కు వినతిపత్రాలు
తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం వివిధ సంఘాల ఆధ్వర్యంలో భారీగా ఆందోళనలు చేపట్టారు. గ్రామ పంచాయతీ సిబ్బంది, కార్మికులు, బంజారాలు, మధ్యాహ్న భోజన కార్మికులు, తెలంగాణ ఆదివాసీ విధ్యార్థి సంఘం నాయకులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాలు చేపట్టారు. గ్రామ పంచాయతీల్లో ఉద్యోగులు కార్మికులుగా పనిచేస్తున్న వారికి బకాయి వేతనాలు విడుదల చేయాలని, ఉద్యోగులను పర్మినెంట్, 2వ పీఆర్‌సీ పరిధిలోకి పంచాయతీ సిబ్బందిని తీసుకురావాలని, కారోబార్, బిల్ కలెక్టర్‌లను సహాయ కార్యదర్శులుగా నియమించడంతోపాటు జీవో 51 సవరించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేపట్టారు.
లంబాడాలకు ఎస్టీ సర్టిఫికేట్లు మంజూరు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ బంజారాలు ధర్నా నిర్వహించారు. సర్టిఫికేట్లను వెంటనే మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 49 వల్ల గిరిజనులు ఉపాధి కాల్పోతారని, జీవోను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనం, కోడిగుడ్ల బిల్లులు వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిచ హామీ మేరకు కార్మికులకు నెలకు రూ.10 వేల గౌరవ వేతనం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.
– ఆదిలాబాద్, జూన్ 30(నమస్తే తెలంగాణ)
జీవో 49ను రద్దు చేయాలని నిరసన
నిర్మల్ చైన్‌గేట్, జూన్ 30 : జీవో నంబర్ 49ను రద్దు చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి కలెక్టర్ అభిలాష అభినవ్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ జీవోను ఉపసంహరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుమ్ర భీంరావు, తుమ్రాన్ సుభాష్, నైతం జగ్గారావు, పెంద్రం సురేందర్, తొడసం జాగాదిరావు, తొడసం జైతు, శ్రీను, విజయ్, నైతం లింగు ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది..
నిర్మల్ అర్బన్, జూన్ 30 : తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింద ని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర నాయకులు కొట్టె శేఖర్, సామ కిరణ్‌రెడ్డిలు మాట్లాడారు. ప్రభుత్వం ఎన్నికల సమయం లో ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షల నగదు, ఉద్యమకారులకు 20 శాతం కోట, బస్సు పాసులో రాయితీ, పెన్షన్ కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు.
సెప్టెంబర్ 10 వరకు ఉద్యమాన్ని దశల వారీగా శాంతియుతంగా చేస్తామని ప్రభుత్వం తక్షణమే స్పం దించి ఇచ్చిన హమీలను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో షరీఫ్, ఇస్మాయిల్, దేవిదాస్, సాగర్ రెడ్డి, వై.సాయన్న, వినోద్, జగన్, పాకాల రాంచందర్, వెంకట్ రాం రెడ్డి, గంగన్న, చంద్రశేఖర్, సామలవీరయ్య, నర్సయ్య, నవీన్, ప్రవీణ్, అకోజి కిషన్ పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజన కార్మికులు..
బంజారాలు..
తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం నాయకులు..
తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం వివిధ సంఘాల ఆధ్వర్యంలో భారీగా ఆందోళనలు చేపట్టారు. గ్రామ పంచాయతీ సిబ్బంది, కార్మికులు, బంజారాలు, మధ్యాహ్న భోజన కార్మికులు, తెలంగాణ ఆదివాసీ విధ్యార్థి సంఘం నాయకులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాలు చేపట్టారు.