ధోనీ బిగ్ డెసిషన్.. ‘ఆ క్యాప్షన్ నాదే..’ ట్రేడ్ మార్క్‌కు అప్లై చేసిన కెప్టెన్ కూల్..

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్టైలే వేరు. మైదానంలో అందరు ఆటగాళ్లు ఎంతో ఒత్తిడిగా కనపడినా ధోనీ మాత్రం చాలా కూల్‌గా ఉంటాడు. తన టీమ్‌ కప్‌ సాధించిన సమయంలోనూ అతడు అత్యుత్సాహం ప్రదర్శించకుండా నెమ్మదిగా వ్యవహరిస్తాడు. అతడిని ఫ్యాన్స్ కెప్టెన్ కూల్ అంటారు.

ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ కూల్ (CAPTAIN COOL) ట్యాగ్‌లైన్‌ కోసం ట్రేడ్‌మార్క్ దరఖాస్తు చేసుకున్నారు. ధోనీ దరఖాస్తు “ఆమోదం పొందింది, దీన్ని ప్రచురించాం” అని ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రీ పోర్టల్‌లో పేర్కొన్నారు. జూన్ 16న అధికారిక ట్రేడ్‌మార్క్ జర్నల్‌లో దీన్ని ప్రచురించారు.

అంటే.. ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రార్ ప్రాథమిక పరిశీలన పూర్తి చేశారు. అధికారిక ట్రేడ్‌మార్క్ జర్నల్‌లో జూన్ 16 ఈ విషయాన్ని ప్రచురించారు. ఈ ప్రచురణ అనంతరం కొన్ని వారాల గడువు ఉంటుంది. అందులో ఎవరైనా అభ్యంతరాలు తెలిపితే విచారణ జరుగుతుంది.

ధోనీ జూన్ 5న దరఖాస్తు సమర్పించాడు. ఈ ట్రేడ్‌మార్క్‌ను క్రీడా శిక్షణ, క్రీడా శిక్షణ సదుపాయాలు, క్రీడా కోచింగ్ సేవల విభాగం కింద రిజిస్టర్ చేస్తారు. దీనిపై ధోనీ ఇప్పటివరకు స్పందించలేదు.

ఇదే సమయంలో ప్రభ స్కిల్ స్పోర్ట్స్ (ఓపీసీ) ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఇదే “కెప్టెన్‌ కూల్” ట్యాగ్‌లైన్‌కు దరఖాస్తు చేసుకుంది. అయితే, ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రీ పోర్టల్‌లో ఆ దరఖాస్తును రిక్టిఫికేషన్ ఫైల్డ్ (దిద్దుబాటు కోసం దాఖలు చేశారు)గా పేర్కొన్నారు. అంటే దరఖాస్తులో కొన్ని తప్పులు లేదా లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దడానికి దరఖాస్తుదారుడు మళ్లీ సంబంధిత అథారిటీకి సమర్పించాడని అర్థం.

మరోవైపు, కొన్ని వారాల క్రితమే ధోనీని “2025 ఏడాది ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌”లో చేర్చారు. ఆస్ట్రేలియా దిగ్గజం మ్యాథ్యూ హెడెన్, దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ హషీమ్ అంలా సహా ఏడుగురు క్రికెటర్లతో కలిసి ధోనీకి ఆ గౌరవం లభించింది.

​అధికారిక ట్రేడ్‌మార్క్ జర్నల్‌లో జూన్ 16 ఈ విషయాన్ని ప్రచురించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *