నల్సార్-సీఎస్‌బీ మధ్య ఎంఓయూ

Follow

- సైబర్ చట్టాల అమలులో కీలక ముందడుగు
హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరాలను అరికట్టే క్రమంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో మరో కీలక ముందుడుగు వేసింది. తెలంగాణలో సైబర్ చట్టాన్ని బలోపేతం చేయడానికి నల్సార్‌వర్సిటీ ఆఫ్ లాతో చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ కీలక ఎంఓయూకి సంబంధించి సీఎస్‌బీ డీజీ శిఖాగోయెల్, నల్సార్‌వర్సిటీ వీసీ ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరావు డీజీపీ జితేందర్ సమక్షంలో సంతకాలు చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ఈ ఒప్పందంతో సైబర్ చట్టాలు, ముఖ్యంగా ఐటీ చట్టాన్ని సమీక్షించి.. అమలులో ఉన్న లోపాలను గుర్తించి వాటి నవీకరణకు సూచనలు చేస్తారని పేర్కొన్నారు. డేటా గోప్యత, ఆర్థిక మోసాలు, డిజిటల్ సాక్ష్యాలు మొదలైన అంశాలపై న్యాయపరంగా ముందుకు వెళ్లాల్సిన అంశాలపై పలు నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. అలాగే సైబర్ బాధితులకు పరిహారం, డిజిటల్ వివాదాల పరిష్కారాలకు రూపకల్పన, పోలీస్, న్యాయ అధికారులకు ప్రత్యేక శిక్షణ, సీఎస్‌బీలో న్యాయ, ఫోరెన్సిక్ సలహా విభాగాన్ని స్థాపించడం, ఏఐ తదితర వాటిపై రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. నల్సార్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరావు మాట్లాడుతూ ఈ భాగస్వామ్యం ద్వారా న్యాయశాస్త్రం, పరిశోధన, విద్య ద్వారా సైబర్ నేరాలు తగ్గించి.. సమాజానికి సేవచేసే అవకాశం లభించిందని అన్నారు.
ఇంకా చదవల్సిన వార్తలు
కెన్సాస్, ఉద్యాన వర్సిటీల మధ్య అవగాహన
హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యాన విద్యార్థుల నైపుణ్య శిక్షణ పెంపుదల, ఉద్యాన పరిశోధనల కోసం అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల పరస్పర మార్పిడి, సంయుక్త పరిశోధన కోసం తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, అమెరికాలోని కెన్సాస్ స్టేట్ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. ములుగులోని ఉద్యాన వర్సిటీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో వర్సిటీ వీసీ రాజిరెడ్డి, కన్సాస్ స్టేట్ యూనివర్సిటీ డైరెక్టర్ వరప్రసాద్ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో తెలంగాణ రైతుల ఆవిషరణలకు బీజం పడిందని, రాష్ట్రంలో ఉద్యానరంగ ప్రమాణాలు పెంచేలా విశ్వవిద్యాలయం ముందుకెళ్తుందని వర్సిటీ వీసీ రాజిరెడ్డి తెలిపారు. వరప్రసాద్ మాట్లాడుతూ.. సేఫ్టీఫుడ్, బయోసేఫ్టీ, క్రిస్పర్ కాస్-9 వంటి ఆధునిక పరిశోధనలను ఉద్యాన పంటలపై ప్రయోగించి ఉత్తమ ఫలితాలు పొందవచ్చని తెలిపారు. అలాగే తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీలు తమ మధ్య సత్సంబంధాలను 12 ఏండ్ల తర్వాత బుధవారం తిరిగి పునరుద్ధరించుకున్నాయి. కాన్సస్ వర్సిటీ డైరెక్టర్ వరప్రసాద్, పీజేటీఏయూ ఉప కులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఈ మేరకు వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఒప్పందపత్రాలు మార్చుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో అగ్రిబయోటెక్ ఫౌండేషన్ చైర్మన్ సురవరం రఘువర్ధన్‌రెడ్డి, వర్సిటీ డీన్ చీనానాయక్, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ డైరెక్టర్ శ్రీనివాసన్, ఉద్యాన కళాశాల ప్రిన్సిపాల్ పోతరాజు ప్రశాంత్, వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ విద్యాసాగర్, సుధాకర్‌రెడ్డి, పిడిగం సైదయ్య, ప్రొఫెసర్లు, అధికారులు పాల్గొన్నారు.ఈసారికి పాత ఫీజులే!
సైబర్ నేరాలను అరికట్టే క్రమంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో మరో కీలక ముందుడుగు వేసింది. తెలంగాణలో సైబర్ చట్టాన్ని బలోపేతం చేయడానికి నల్సార్‌వర్సిటీ ఆఫ్ లాతో చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్నది.