నిరాధారమైనవి రాయొద్దు

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Rr2
  • బీఆర్‌ఎస్‌ పార్టీ వికారాబాద్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ మెతుకు ఆనంద్‌

వికారాబాద్‌, జూన్‌ 29 : నిరాధారమైన రాతలు రాయడాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ వికారాబాద్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. కొంతకాలంగా కొన్ని మీడియా సంస్థలు కేసీఆర్‌, కేటీఆర్‌ కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకొని జుగుప్సాకరమైన శీర్షికలతో రాతలు రాసి ప్రచురించడం ఏమాత్రం మంచిది కాదని మండిపడ్డారు. వారికీ కుటుంబాలు ఉంటాయని ఆలోచించాలన్నారు. సమాజంలో జరుగుతున్న మంచి, చెడులను విశ్లేషించి ప్రజలకు సమాచారం అందించడం జర్నలిస్టుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.

ఆ వృత్తిని నిబద్ధతతో నిర్వర్తించాలన్నారు. కొన్ని సంస్థలు, వ్యక్తులు జర్నలిజాన్ని భ్రష్టు పట్టించే చర్యలకు పాల్పడుతూ, సమాజాన్ని చెడు వైపు నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఇది సమాజానికి, పత్రిక, మీడియా స్వేచ్ఛకు మంచిది కాదన్నారు. తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉన్నత స్థాయి వ్యక్తులను టార్గెట్‌ చేస్తున్నారన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం రాష్ట్ర అంతర్గత భద్రతకు సంబంధించినదని.. దీనిపై విచారించేందుకు హైకోర్టు ఉందన్నారు. ఇప్పటికే ప్రత్యేకంగా సిట్‌ను ఏర్పాటు చేశారని.. ఏమైనా విషయాలుంటే వారు బయటపెట్టాలే తప్ప ఆధారాల్లేకుండా ఎవరో చెప్పారని ఇష్టం వచ్చినట్టు రాస్తే ప్రజాస్వామ్యంలో ఎవ్వరూ ఊరుకోరని ఆయన హెచ్చరించారు.

అసత్య ప్రచారాన్ని మానుకోవాలి
చేవెళ్లటౌన్‌ : జర్నలిజం ముసుగులో మాజీ మంత్రి కేటీఆర్‌పై ఓ టీవీ చానల్‌ చేస్తున్న అసత్య ప్రచారాన్ని మానుకోవాలని డీసీఎంఎస్‌ చైర్మన్‌ పట్లోళ్ల కృష్ణారెడ్డి, బీఆర్‌ఎస్‌ పార్టీ చేవెళ్ల మండలాధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్‌ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై దురుద్దేశపూర్వకంగా అసత్య వార్తలు ప్రసారం చేసిన ఆ ఛానల్‌పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

​నిరాధారమైన రాతలు రాయడాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ వికారాబాద్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. కొంతకాలంగా కొన్ని మీడియా సంస్థలు కేసీఆర్‌, కేటీఆర్‌ కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకొని జుగుప్సాకరమైన శీర్షికలతో రాతలు రాసి ప్రచురించడం ఏమాత్రం మంచిది కాదని మండిపడ్డారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *