నీకు ఇందిరమ్మ ఇల్లు రాదు పో.. మా ఇండ్ల మీద పడి ఎందుకు ఏడుస్తున్నవ్‌?.. దివ్యాంగురాలిపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రుసరుస​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Indiramma Indlu
  • ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి మాట తప్పిన పరకాల ఎమ్మెల్యే రేవూరి
  • అవమానభారంతో దివ్యాంగురాలి కంటతడి

గీసుగొండ, జూన్‌ 18 : ‘నీకు ఇల్లు రాదు.. మా ఇండ్ల మీద పడి ఎందుకు ఏడుస్తున్నవ్‌?’ అంటూ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అవమానించారని ఓ దివ్యాంగురాలు కన్నీటి పర్యంతమైంది. దివ్యాంగుల కోటాలోనైనా ఇల్లు ఇవ్వాలని వేడుకోగా ‘నీకు ఏ కోటాలోనూ ఇల్లు రాదు. ఇక్కడి నుంచి వెళ్లిపో’ అని తేల్చిచెప్పారని తెలిపింది. ఎమ్మెల్యే మాటలతో మనస్తాపం కలిగిందంటూ బాధితురాలు నిర్మల విలపించింది. వివరాల్లోకి వెళ్తే వరంగల్‌ గరీబ్‌నగర్‌ కాలనీకి చెందిన లింగంపల్లి నిర్మల పరదాలు కట్టుకొని నివసిస్తున్నది.

ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చిన రేవూరి తమ పరిస్థితిని చూసి ‘నీవు దివ్యాంగురాలివి, కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక నీకే ముందుగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తా’ అని హామీ ఇచ్చారని నిర్మల తెలిపింది. తాజాగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో తన పేరు రాలేదని చెప్పేందుకు భర్త సురేశ్‌తో కలిసి ఎమ్మెల్యే ఇంటికి వెళ్లానని పేర్కొంది. తాను వెళ్లడాన్ని చూసిన ఎమ్మెల్యే అసహనంగా వ్యవహరించారని తెలిపింది. బాధితురాలిని డివిజన్‌ కార్పొరేటర్‌ మనీషాశివకుమార్‌, బీఆర్‌ఎస్‌ నేతలు ఓదార్చారు.

ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని.. ఉన్న ఇల్లు కూలగొట్టుకున్నడు

  • తుది జాబితాలో పేరు లేక రోడ్డునపడ్డ నిరుపేద సడువలి
  • మంచిర్యాల జిల్లాలో విచిత్ర ఘటన

చెన్నూర్‌ రూరల్‌, జూన్‌ 18 : ఇందిరమ్మ ఇల్లు మంజూరైందన్న ఆనందంతో ఉన్న ఇంటిని కూలగొట్టుకున్నాడో వ్యక్తి. తీరా తుది జాబితాలో తన పేరు లేకపోవడంతో రోడ్డునపడ్డాడు. ఈ విచిత్ర ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ మండలం కొమ్మెర గ్రామంలో చోటుచేసుకున్నది. కొమ్మెరలోని ఎస్సీ కాలనీకి చెందిన లేతకరి సడువలి బర్రెలు కాస్తూ భార్యా పిల్లలను పోషించుకుంటున్నాడు. గతంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇంటికోసం దరఖాస్తు చేసుకున్నాడు. జాబితాలో పేరు వచ్చిందని అధికారులు సర్వేకు వచ్చారు.

01

పాత ఇంటి ఫొటో తీసుకొని వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఆపై కాంగ్రెస్‌ కమిటీ సభ్యులు.. లేతకరి సడువలి పేరును ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో చేర్చారు. ఇల్లు మంజూరైందన్న సంతోషంలో పాత ఇంటిని కూలగొట్టించాడు. ఏమైందో ఏమో తెలియదుగానీ.. ఇందిరమ్మ ఇండ్ల చివరి జాబితాలో పేరు రాలేదని అధికారులు చెప్పారు. దీంతో సడువలి తీవ్రనిరాశకు గురయ్యాడు. ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని ఉన్న ఇంటిని కూలగొటుకుని రోడ్డున పడ్డానని, అధికారులు స్పందించి రెండో జాబితాలోనైనా ఇల్లు వచ్చేలా చూడాలని వేడుకుంటున్నాడు.

​‘నీకు ఇల్లు రాదు.. మా ఇండ్ల మీద పడి ఎందుకు ఏడుస్తున్నవ్‌?’ అంటూ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అవమానించారని ఓ దివ్యాంగురాలు కన్నీటి పర్యంతమైంది. దివ్యాంగుల కోటాలోనైనా ఇల్లు ఇవ్వాలని వేడుకోగా ‘నీకు ఏ కోటాలోనూ ఇల్లు రాదు. ఇక్కడి నుంచి వెళ్లిపో’ అని తేల్చిచెప్పారని తెలిపింది.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *