నేడు ఉద్యాన వర్సిటీ నాలుగో స్నాతకోత్సవం

Follow

హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం నాలుగో స్నాతకోత్సవానికి ముస్తాబయింది. జూలై 1న జరగనున్న ఈ స్నాతకోత్సవానికి తెలంగాణ గవర్నర్, వర్సిటీ చాన్స్‌లర్ జిష్ణుదేవ్ వర్మ ఆధ్వర్యంలో ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్టు ఉద్యాన వర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ దండ రాజిరెడ్డి ఆదివారం ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్‌లో గల రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో స్నాతకోత్సవం జరగనున్నది. వివిధ రంగాల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు గవర్నర్ బంగారు పతకాలను ప్రదానం చేయనున్నారు. స్నాతకోత్సవం మొత్తాన్ని యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అందిస్తున్నట్టు వీసీ దండ రాజిరెడ్డి తెలిపారు.
కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం నాలుగో స్నాతకోత్సవానికి ముస్తాబయింది.