నేడు తెరుచుకోనున్న బాబ్లీ గేట్లు
Follow
– అక్టోబర్ 28 వరకు ఓపెన్
– ఎస్సారెస్పీలో 15 టీఎంసీల నీరు నిల్వ
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని ఎస్సారెస్పీ ఎగువన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీప్రాజెక్టు గేట్లు నేడు(జులై 1వ తేదీన) తెరుచుకోనున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి ఏడాది వర్షాకాలంలో జులై 1వ తేదీ నుంచి అక్టోబర్ 28వ తేదీ వరకు గేట్లు తెరవనున్నారు. ఆ తర్వాత మూసివేస్తారు. అదే విధంగా మార్చి 1వ తేదీన తాగునీటి అవసరాల కోసం ఒకసారి గేట్లు తెరుస్తారు. బాబ్లీకి మొత్తం 14 గేట్లు ఉండగా.. మహారాష్ట్ర, తెలంగాణ అధికారుల సమక్షంలో అ్నఇ్న గేట్లు తెరవనున్నారు. ప్రస్తుతం బాబ్లీప్రాజెక్టులో 0.3 టీఎంసీల నీరుమాత్రమే నిల్వ ఉంది.
ఎస్సారెస్పీలో 15 టీఎంసీల నీరు
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 15 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రస్తుతం 1817 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1064.7 అడుగుల (15.671 టీఎంసీల) నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయంలో 1059.60 అడుగుల 10.188 టీఎంసీల నిరు నిల్వ ఉంది.
The post నేడు తెరుచుకోనున్న బాబ్లీ గేట్లు appeared first on Navatelangana.
– అక్టోబర్ 28 వరకు ఓపెన్– ఎస్సారెస్పీలో 15 టీఎంసీల నీరు నిల్వనవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధిఉత్తర తెలంగాణ వరప్రదాయిని ఎస్సారెస్పీ ఎగువన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీప్రాజెక్టు గేట్లు నేడు(జులై 1వ తేదీన) తెరుచుకోనున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి ఏడాది వర్షాకాలంలో జులై 1వ తేదీ నుంచి అక్టోబర్ 28వ తేదీ వరకు గేట్లు తెరవనున్నారు. ఆ తర్వాత మూసివేస్తారు. అదే విధంగా మార్చి 1వ తేదీన తాగునీటి అవసరాల కోసం ఒకసారి గేట్లు తెరుస్తారు.
The post నేడు తెరుచుకోనున్న బాబ్లీ గేట్లు appeared first on Navatelangana.