నేడు తెరుచుకోనున్న బాబ్లీ గేట్లు.. ఎస్సారెస్పీలోకి వరద పెరిగే అవకాశం

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Babli Project

మోర్తాడ్‌, జూన్‌ 30: జిల్లాలోని ఎస్సారెస్పీ ఎగువన మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్‌ గేట్లు నేడు (మంగళవారం) తెరుచుకోనున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జూలై 1 నుంచి అక్టోబర్‌ 28 వరకు గేట్లు ఎత్తిఉంచాల్సి ఉంటుంది. ఈ మేరకు త్రిసభ్యకమిటీ ఆధ్వర్యంలో బాబ్లీ ప్రాజెక్ట్‌ గేట్లు తెరవనున్నారు. అక్టోబర్‌ 28 వరకు బాబ్లీ గేట్లు తెరచి ఉంచడంతో సీజన్‌లో కురిసిన వర్షపు నీరు బాబ్లీ దిగువన ఉన్న శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి నేరుగా వచ్చి చేరుతుంది. బాబ్లీ గేట్లు ఎత్తడంతో ఎస్సారెస్పీలోకి 0.3టీఎంసీల నీరు వస్తుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం బాబ్లీ ప్రాజెక్ట్‌లో 331.41మీటర్ల మేరకు నీరు ఉన్నదని పేర్కొన్నారు.

బాబ్లీ గేట్లు తెరవనున్న సందర్భంగా ఎస్సారెస్పీ ఎస్‌ఈ శ్రీనివాస్‌రావుగుప్తా, ఈఈ చక్రపాణి, ఏఈ కొత్తరవి బాబ్లీకి వెళ్లనున్నారు. ప్రసుత్తం ఎస్సారెస్పీకి 1,817 క్యూసెక్కుల వరద వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు (80.5 టీఎంసీలు)కాగాప్రస్తుతంప్రాజెక్ట్‌ల 1064.70అడుగుల(15.671టీఎంసీలు)నీటినిల్వ ఉన్నది. ప్రాజెక్ట్‌ నుంచి కాకతీయకాలువకు 100, మిషన్‌భగీరథకు 231క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, 286 క్యూసెక్కుల నీరు ఆవిరిరూపంలో వెళ్తున్నది.

నిజాంసాగర్‌ ప్రాజెక్టులో చేపల వేట నిషేధం

బాన్సువాడ (నిజంసాగర్‌), జూన్‌ 30: నిజాంసాగర్‌ ప్రాజెక్టులో జూలై, ఆగస్టు నెలల్లో చేపల వేటను నిషేధిస్తున్నట్లు మత్స్యశాఖ అధికారి డోల్‌సింగ్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జూలై, ఆగస్టు రెండు మాసాల్లో వర్షాలకు ప్రాజెక్టులో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుందని, చేపల ఉత్పత్తి కూడా పెరుగుతుందని తెలిపారు. తద్వారా చేప ల వేటపై ఆధారపడిన మత్స్యకారులకు ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. రెండునెలలపాటు చేపలు, రొయ్యలు వేటాడవద్దని, మత్స్యశాఖ ఆదేశాలు పాటించనివారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

​జిల్లాలోని ఎస్సారెస్పీ ఎగువన మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్‌ గేట్లు నేడు (మంగళవారం) తెరుచుకోనున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జూలై 1 నుంచి అక్టోబర్‌ 28 వరకు గేట్లు ఎత్తిఉంచాల్సి ఉంటుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *