నేడు, రేపు మోస్తరు వర్షాలు

Follow

- రాష్ట్రంపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావం
- వెల్లడించిన హైదరాబాద్ వాతావరణశాఖ కేంద్రం
హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిశలనుంచి గాలులు వీస్తున్నాయని ఫలితంగా.. రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. గురువారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వానలు కురిసినట్టు పేర్కొన్నది.
శుక్ర, శనివారాల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలిపింది. కాగా, గడిచిన 24 గంటల్లో వనపర్తి, మహబూబ్‌నగర్, నిర్మల్, ఆదిలాబాద్, నాగర్‌కర్నూల్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో తేలికపాటి వానలు కురిశాయని వివరించింది.
సీజన్‌లో 7రోజులే వానలు
నైరుతి రుతుపవనాలు ప్రవేశించి 19రోజులైనప్పటికీ.. ఇప్పటివరకు సగటున 7రోజుల వర్షపాతం మాత్రమే నమోదైనట్టు వాతావరణశాఖ వెల్లడించింది. కేవలం కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 8రోజులు గరిష్ఠంగా వర్షాలు కురిశాయని వాతావరణశాఖ తెలిపింది. సంగారెడ్డి, వనపర్తిలో 7రోజులు, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల, సిద్దిపేట, నిర్మల్, ఆదిలాబాద్, యాదాద్రి-భువనగిరి, మెదక్ జిల్లాల్లో 6రోజుల చొప్పున వర్షపాతం నమోదైందని వెల్లడించింది. మిగతా జిల్లాల్లో ఒకటి నుంచి 4రోజులపాటు వర్షపాతం నమోదైనట్టు వివరించింది.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిశలనుంచి గాలులు వీస్తున్నాయని ఫలితంగా.. రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది.