నేత కార్మికులకు రుణమాఫీ చేయాలి

Follow

- భూదాన్‌పోచంపల్లిలో రిలే నిరాహార దీక్షలు
భూదాన్‌పోచంపల్లి, జూన్ 30: ప్రభుత్వం చేనేత కార్మికులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం భూదాన్‌పోచంపల్లిలో పద్మశాలీ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేనేత నా యకుడు కొంక లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ చేనేత కార్మికుల రుణమాఫీకి ప్రభుత్వం జీఓ జారీ చేసినా నేటికీ మాఫీ కాలేదని, నిబంధనల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించా రు. జియో ట్యాగ్ కలిగిన అర్హులైన చేనేత కార్మికులకు చేనేత సహకార సంఘంలో సభ్యత్వం ఇచ్చిన తర్వాతే సహకార సం ఘ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని, త్రిఫ్ట్ పథకంలో అర్హులైన వారు చాలామంది ఉన్నారని, వారందరికీ న్యాయం చేయాలని కోరారు. అభయ హస్తం పథకంలో అందరికీ యార్న్ సబ్సి డీ ఇవ్వాలని, అర్హులైన వారందరికీ కొత్తగా జియో ట్యాగ్ నెంబర్లు ఇచ్చి లబ్ధి చేకూర్చాలని కోరారు. దీక్షకు మద్దతుగా రాష్ట్ర చేనేత జన సమాఖ్య అధ్యక్షుడు చింతకింది రమేష్, మాజీ కౌన్సిలర్ గుండు మధు, సీపీఐ పట్టణ కార్యదర్శి మిరియాల కృష్ణమూర్తి, నాయకులు కుడికాల బలరాం, చింతకింది కిరణ్, సీత శ్రవణ్, గుండు ప్రవీణ్, పగిడిమర్రి రాజు, సిద్ధగోని ప్రభాకర్, సీత చంద్రయ్య, పొట్టబత్తిని ధనంజయ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం చేనేత కార్మికులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం భూదాన్‌పోచంపల్లిలో పద్మశాలీ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేనేత నా యకుడు కొంక లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు.