నేనేం చేయలేను.. బీఆర్‌ఎస్ వాళ్లను కలవండి!

Follow

- ఎనికెపల్లిపై చేతులెత్తేసిన ఎమ్మెల్యే కాలె యాదయ్య
- నేటి నుంచి ఆందోళనకు సిద్ధమవుతున్న రైతులు
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ‘నేనేం చేయలేను… మీరు బీఆర్‌ఎస్ వాళ్లను కలవండి’ ఇవీ బీఆర్‌ఎస్‌లో గెలిచి, కాంగ్రెస్‌లో చేరిన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఎనికెపల్లి రైతులతో చేసిన వ్యాఖ్యలు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములను గోశాల పేరుతో సర్కారు లాక్కుంటున్నదని, ఆదుకోవాలంటూ వచ్చిన రైతులు, ప్రజలతో ఎమ్మెల్యే మాట్లాడిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇందిరాగాంధీ హయాం లో రంగారెడ్డి జిల్లా ఎనికెపల్లిలో 99.14 ఎకరాల భూమిని 50 మంది పేదలకు పంపిణీ చేశారు. ఆ భూముల్లో రైతులు వ్యవసాయం చేసుకుంటుండగా.. అక్కడ గోశాల ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించి, బోర్డులు ఏర్పాటు చేసింది. జీవనోపాధి కోల్పోకుండా ఆదుకోవాలని రైతులు ఎమ్మెల్యే కాలె యాదయ్యను ఆశ్రయించారు.
ముఖ్యమంత్రితో మాట్లాడి న్యాయం చేస్తానని చెప్పుకొచ్చిన ఆయన.. ఇప్పుడు తానేమీ చేయలేనంటూ చేతులెత్తేశారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రైతులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. రెండు రోజుల కిందట వాదనలు మొదలయ్యాయి. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రత్యక్ష ఆందోళనలు కూడా చేపట్టాలని, ఇందులో భాగంగా నేడు నిరసన దీక్షలు ప్రారంభించనున్నట్టు తెలిసింది.
‘నేనేం చేయలేను… మీరు బీఆర్‌ఎస్ వాళ్లను కలవండి’ ఇవీ బీఆర్‌ఎస్‌లో గెలిచి, కాంగ్రెస్‌లో చేరిన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఎనికెపల్లి రైతులతో చేసిన వ్యాఖ్యలు.