పథకాల డొల్లతనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

Follow

- ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి
- నమ్మకద్రోహులకు పార్టీలో స్థానం లేదు
- కార్యకర్తలతో మాజీ మంత్రి సింగిరెడ్డి
వనపర్తి, జూన్ 18(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలపై ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రదర్శిస్తున్న డొల్లతనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం నియోజకవర్గంలోని పెబ్బేరు, శ్రీరంగాపురం మండలాల వారీగా ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం జిల్లా కేంద్రంలో నిర్వహించారు.
ఈ సందర్బంగా సింగిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ మోసపూరిత వాగ్ధా నాలతో అధికారంలోకి వచ్చిందని, అధికారం చేపట్టిన అనంతరం ఒక్క సంక్షేమ పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయ ని, అవకాశం కోసమే ఎదురు చూస్తున్నారన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇందుకు బీఆర్‌ఎస్ నాయకులు వ్యూహాత్మకంగా పని చేయాలన్నారు. గ్రామాల్లో ముఖ్య నాయకులు, కార్యకర్తలు ప్రజా సమస్యలపై దృష్టి నిలిపి బాసటగా నిలవాలన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ తడబడుతుందని, ఏడాదిన్నరకుపైగా వాయిదా వేసుకుంటూ వెళ్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్రమ శిక్షణతో పని చేయాలని, ప్రతి కార్యకర్తను అప్రమత్తం చేయడంలో నాయకులు నిమగ్నం కావాలని, పార్టీ ద్రోహులకు బీఆర్‌ఎస్‌లో స్థానం లేదని తేల్చిచెప్పారు. సమావేశంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమళ్ల అశోక్, మండల అధ్యక్షుడు వనం రాములు, మండ్ల సత్యారెడ్డి, కర్రెస్వామి, వెంకటస్వామి, రంగాపురం కృష్ణారెడ్డి, దిలీప్ రెడ్డి, చిట్యాల రాము, జగన్నాథం, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలపై ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రదర్శిస్తున్న డొల్లతనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.