పరిష్కారం చూపండి.. ప్రజావాణిలో కలెక్టర్లకు వినతుల వెల్లువ

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Collectors, Prajavani

ఆదిలాబాద్‌(నమస్తే తెలంగాణ)/నిర్మల్‌ చైన్‌గేట్‌, జూన్‌ 30 : ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లోని కలెక్టరేట్‌ కార్యాలయాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. నిర్మల్‌ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, ఆదిలాబాద్‌లో కలెక్టర్‌ రాజర్షి షా దరఖాస్తులను స్వీకరించారు. నిర్మల్‌లో 105, ఆదిలాబాద్‌లో 98 వినతులు వచ్చాయి. ఈ సందర్భంగా ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు, పెండింగ్‌ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్లు అధికారులకు సూచించారు. నిర్మల్‌లో కలెక్టర్‌తోపాటు స్థానిక సంస్తల అదనపు కలెక్టర్‌ ఫైజాన్‌ అహ్మద్‌, ఆర్డీవో రత్నకల్యాణి.. ఆదిలాబాద్‌లో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్యామలదేవి, ట్రెయినీ కలెక్టర్‌ సలోని చాబ్ర అర్జీలను స్వీకరించారు.

రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి

నిర్మల్‌ పట్టణంలోని బెస్తవార్‌పేట 24, 25 వార్డుల్లో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, వాటిని మరమ్మతులు చేపట్టడం లేదని కాలనీవాసులు కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. నిత్యం ఈ దారి గుండా వాహనాలు నడుస్తున్నాయి. గుంతలు ఉం డడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అధికారు లు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు పేర్కొన్నారు. సమస్య పరిష్కరించాలని కలెక్టర్‌ను కోరారు.

జాబితాలోని పేర్లను తొలగించారు

ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో ఉన్న పేర్లను కమిటీ సభ్యులు, అధికారులు తొలగించారని ఆదిలాబాద్‌ జిల్లాలోని బంగారుగూడకు చెందిన పేదలు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అధికారులు విడుదల చేసిన మొదటి జాబితాలో తమ పేర్లు ఉండగా.. ఇటీవల వచ్చిన వాటిలో తమ పేర్లు లేవన్నారు. రోజు వారీ కూలీ పనులు చేసుకుంటూ ఉపాధి పొందే తాము తడకల ఇండ్లలో నివాసం ఉంటున్నామని, వర్షాకాలంలో ఇండ్లలోకి నీరు ప్రవేశించడంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. అధికారులు విచారణ జరిపి తమకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని కోరారు.

పరిహారం చెల్లించాలి..

నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌ మండలంలోని గొల్లమాడకు చెందిన రైతులు ఎస్సారెస్పీ ప్యాకేజీ-27 కింద రైతులు పదెకరాల వరకు భూములు కోల్పోయారు. వారికి అధికారులు పరిహారం ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాలేదు. పరిహారం ఇప్పించాలని కోరుతూ గ్రామానికి చెందిన రైతులు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

పాఠశాలకు అనుమతించాలి..

నిర్మల్‌ పట్టణంలోని వశిష్ట పాఠశాలలో బెస్ట్‌ అవైలెబుల్‌ పాఠశాల కింద ల క్కీ డ్రా ద్వారా విద్యార్థులు పాఠశాలలో చేరారు. అయితే ప్రభుత్వం నుంచి ఆయా పాఠశాలలకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో పాఠశాల విద్యార్థులను యాజమాన్యం రానివ్వడం లేదు.ఈ మేరకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చి వినతిపత్రం సమర్పించారు. పాఠశాలలో చదువులు కొనసాగేలా చూడాలని కలెక్టర్‌ను కోరారు.

మూడు నెలలుగా వేతనాలు లేవు..

నిర్మల్‌ జిల్లాలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రాల్లో రాజీవ్‌ ఆరోగ్యశ్రీ విభాగంలో 21 మంది ఆరోగ్య మిత్రలుగా నెట్‌వర్క్‌ విధులు నిర్వహిస్తున్నారు. వీరికి మూడు నెలలుగా వేతనాలు రావడం లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విధుల కొనసాగింపు కోసం రెన్యువల్‌ చేయలేదు. ప్రతినెల వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

​ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లోని కలెక్టరేట్‌ కార్యాలయాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. నిర్మల్‌ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, ఆదిలాబాద్‌లో కలెక్టర్‌ రాజర్షి షా దరఖాస్తులను స్వీకరించారు. నిర్మల్‌లో 105, ఆదిలాబాద్‌లో 98 వినతులు వచ్చాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *