పిచ్చికుక్క స్వైర విహారం​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Dog Attack
  • ధర్పల్లిలో 13 మందిపై దాడి..

ధర్పల్లి, జూన్‌ 18 : మండల కేంద్రంలో ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేస్తున్నది. మనిషి కనిపిస్తే చాలు వెంటపడి దాడి చేస్తున్నది. దీంతో పెద్దలు, చిన్నారులు బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. మండల కేంద్రంలోని అంగడీబజార్‌లో నరేందర్‌ అనే వ్యక్తిపై బుధవారం పిచ్చికుక్క దాడి చేసింది. అతడితోపాటు వివిధ కాలనీల్లో ఉన్న సుజాత, వరుణ్‌, హర్షిత్‌, రాజశేఖర్‌, సయ్యద్‌ రెహన్‌, ఒల్లెపు నరేందర్‌, రిత్విక్‌రెడ్డి, చందర్‌రెడ్డి, రాకేశ్‌, భాగ్య, రమాదేవి, ఉదయ్‌ ఇలా 13 మందిని కరిచింది.

దీంతో బాధితులందరూ స్థానిక ప్రభుత్వ దవాఖానకు వెళ్లారు. దవాఖానలో చికిత్స అందించడానికి ఏఎన్‌ఎం, సిబ్బంది తప్ప వైద్యులు లేకపోవడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పలువురిపై దాడిచేసిన పిచ్చి కుక్కను స్థానికులు వెంబడించి హతమార్చారు. అధికారులు స్పందించి కుక్కల బెడదను నివారించాలని కోరారు.

​మండల కేంద్రంలో ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేస్తున్నది. మనిషి కనిపిస్తే చాలు వెంటపడి దాడి చేస్తున్నది. దీంతో పెద్దలు, చిన్నారులు బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. మండల కేంద్రంలోని అంగడీబజార్‌లో నరేందర్‌ అనే వ్యక్తిపై బుధవారం పిచ్చికుక్క దాడి చేసింది. అతడితోపాటు వివిధ కాలనీల్లో ఉన్న సుజాత, వరుణ్‌, హర్షిత్‌, రాజశేఖర్‌, సయ్యద్‌ రెహన్‌, ఒల్లెపు నరేందర్‌, రిత్విక్‌రెడ్డి, చందర్‌రెడ్డి, రాకేశ్‌, భాగ్య, రమాదేవి, ఉదయ్‌ ఇలా 13 మందిని కరిచింది.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *