పేలిన రియాక్టర్‌

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

13 మంది కార్మికుల దుర్మరణం… విషమ స్థితిలో మరో 12 మంది

. ఎగిసిన మంటలు… కుప్పకూలిన మూడంతస్తుల భవనం
. మృతుల్లో సిగాచీ కెమికల్స్‌ వీపీ గోవన్‌
. పాశమైలారం పారిశ్రామికవాడలో ప్రమాదం

విశాలాంధ్ర – పటాన్‌చెరు : సంగారెడ్డి జిల్లా పటాన్‌ చెరు పరిధిలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో సోమవారం ఉదయం జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటనలో 13 మంది కార్మికులు దుర్మరణం చెందారు. సంఘటన స్థలిలో ఏడుగురు మృతి చెందగా…మరో ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పరిశ్రమ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎల్‌ఎన్‌ గోవన్‌ కూడా ఉన్నారు. గోవన్‌ అడుగుపెట్టిన సమయంలోనే ప్లాంట్‌లో పేలుడు సంభవించింది. ప్రమాద ధాటికి ఆయన కారు నుజ్జునుజ్జయింది. పేలుడు ధాటికి కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. పేలుడు తీవ్రతకు ఉత్పత్తి విభాగం ఉన్న మూడంతస్తుల భవనం కుప్ప కూలిపోగా… మరో భవనం బీటలు వారింది. పక్కనున్న పరిశ్రమల్లోని నిర్మాణాలు సైతం దెబ్బతిన్నట్లు తెలిసింది. తీవ్ర గాయాలైన మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. అసలేం జరిగిందంటే… ఉదయం 9.30 గంటల సమయంలో పాశమైలారం పారిశ్రామిక వాడలోని స్థానిక సిగాచీ రసాయన పరిశ్రమలో రియాక్టర్‌ ఒక్కసారిగా పేలిపోయింది. అకస్మాత్తుగా మంటలు ఎగసిపడటం, పేలుడుతో పరిసరాలు దద్దరిల్లాయి. పేలుడు ధాటికి పరిశ్రమ పరిధిలో పనిచేస్తున్న కార్మికులు గాల్లోకి ఎగిరి పడిపోయినట్టు స్థానికులు తెలిపారు. సుమారు 100 మీటర్ల దూరం వరకు శరీర భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే 11ఫైర్‌ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకోగా… అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైనవారిని అంబులెన్సుల్లో సమీప ఆసుపత్రులకు తరలించారు. పేలుడు సమయంలో పరిశ్రమలో విధుల్లో ఉన్న కొంతమంది కార్మికులు బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకు న్నారు. అయితే పేలుడు శబ్దం చాలా దూరం వరకు వినిపించడంతో పరిసర ప్రాంతాల్లోని స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలు ఇప్పటికీ స్పష్టంగా తెలియకపోయినా… రియాక్టర్‌లో ఏదైనా సాంకేతిక లోపం వల్లే పేలుడు సంభవించి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. పరిశ్రమలో రక్షణ నిబంధనలు పాటించారా లేదా అన్న దానిపై అధికారులు దృష్టి సారించారు. ఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్‌ పరిశీలిం చారు. సహాయక చర్యలపై అధికారులకు సూచ నలు చేశారు. పరిశ్రమ నుంచి ఘాటైన వాసనలు వెలువడటంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడ్డారు. కాగా ఘటనా స్థలికి మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్‌ వెంకటస్వామి, పటాన్‌ చెరు ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి చేరుకున్నారు. ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది కార్మికులు మరణించినట్లు మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడిరచారు. 12 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో 90 మంది ఉన్నారని, 22 మంది కార్మికులు కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నారని వెల్లడిరచారు. ఆయన ప్రమాద స్థలిని పరిశీలించారు. భవనం శిథిలాలు తొలగిస్తేనే ఎంతమంది బాధితులున్నారో తెలుస్తుందన్నారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు 163మంది కార్మికులు విధుల్లో ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ప్రధాని సంతాపం…
పాశమైలారం ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.50వల చొప్పున ఎక్స్‌ గ్రేషియాను ప్రకటించారు. తెలంగాణ గవర్నర్‌ విష్ణుదేవ్‌వర్మ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు పరిహారం, మెరుగైన వైద్యసహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కార్మికులను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. కాగా పరిశ్రమల్లో భద్రతపై త్వరలోనే ఒక కమిటీ వేస్తామని రాష్ట్ర కార్మిక మంత్రి వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. అధిక పనిగంటలపై కార్మికులు ఫిర్యాదు చేస్తే లేబర్‌ కమిషన్‌ దర్యాప్తు చేస్తుందన్నారు.
కేసీఆర్‌ దిగ్భ్రాంతి
సిగాచీ కెమికల్స్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతులకు తన సంతాపం ప్రకటించారు. ప్రమాదానికి కారణాలపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య చికిత్స అందించాలని, చనిపోయిన కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మిన్నంటిన రోదనలు
మరోవైపు మరికొంతమంది కార్మికులు ఇంకా పరిశ్రమలోనే చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో పరిశ్రమలోకి చొచ్చుకెళ్లేందుకు కార్మికుల కుటుంబాలు యత్నించాయి. తమవారి ఆచూకీ చెప్పాలంటూ బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలోకి వారిని వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడంతో కుటుంబసభ్యులు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఘటనాస్థలిలో కార్మికుల కుటుంబాల రోదనలు మిన్నంటాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 108 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రుల్లో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

The post పేలిన రియాక్టర్‌ appeared first on Visalaandhra.

​13 మంది కార్మికుల దుర్మరణం… విషమ స్థితిలో మరో 12 మంది . ఎగిసిన మంటలు… కుప్పకూలిన మూడంతస్తుల భవనం. మృతుల్లో సిగాచీ కెమికల్స్‌ వీపీ గోవన్‌. పాశమైలారం పారిశ్రామికవాడలో ప్రమాదం విశాలాంధ్ర – పటాన్‌చెరు : సంగారెడ్డి జిల్లా పటాన్‌ చెరు పరిధిలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో సోమవారం ఉదయం జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటనలో 13 మంది కార్మికులు దుర్మరణం చెందారు. సంఘటన స్థలిలో ఏడుగురు మృతి చెందగా…మరో ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ
The post పేలిన రియాక్టర్‌ appeared first on Visalaandhra. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *