పొటాష్ ధరలకు రెక్కలు

Follow

- బస్తాపై ఏకంగా 275 పెంపు
- ఒక్కో బస్తా ధర 1800
- వచ్చే నెల 5 నుంచే అమలు
- రైతులపై అదనపు భారం
మూలిగే నకపై తాటిపండు పడ్డ చందంగా మారింది రైతుల పరిస్థితి.. అసలే డీఏపీ, యూరియా కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రమంలో కేంద్రం పొటాష్ ధరను అమాంతంగా పెంచింది. మొన్నటి దాకా బస్తా ధర 1525 ఉండగా, ఇప్పుడు ఒక్కో బస్తాపై 275 పెంచి 1800 చేసింది. అసలే బోనస్ రాక పెట్టుబడికి అవస్థలు పడుతున్న అన్నదాతలకు పెరిగిన పొటాష్ గుదిబండగా మారనుంది. పెరిగిన ధర వచ్చేనెల 5వ తేదీ నుంచి అమలులోకి రానుండగా, ధర పెంపుపై రైతాంగం మండిపడుతున్నది.
హజూరాబాద్, జూన్ 29 : వ్యవసాయంలో తప్పనిసరిగా అవసరమయ్యే పొటాష్‌ను ప్రతి పంటలోనూ రైతులు ఉపయోగిస్తారు. పత్తి కాయ దశలో ఉండగా, వరి చిరు పొట్ట దశ, మక గింజలు పాలు పోసుకునే స్థితితోపాటు ఇతర పంటల్లో ఎక్కువగా వాడుతారు. కొందరు రైతులు దుక్కిలోనూ ఉపయోగిస్తారు. అయితే పంట, గింజలు బలంగా ఉండాలంటే కచ్చితంగా పొటాష్ వేయాలి. అయితే, పంటల సాగుకు ముందే కేంద్రం గుట్టు చప్పుడు కాకుండా ధర పెంచి రైతుల నడ్డి విరుస్తున్నది.
పాత స్టాకు సరఫరా కూడా వారం రోజుల కిందే నిలిచిపోయింది. డీలర్ల వద్ద ఉన్న పొటాష్ నిల్వలు నిండుకునే పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో పెంచిన ధరతో పొటాష్ బస్తాలు కొనుగోలు చేయాలంటే రైతులకు గుదిబండగా మారనుంది. మొన్నటి దాకా బస్తా ధర 1525 ఉండగా, పెంచిన ధరతో 1800 కానుంది. కరీంనగర్ జిల్లాలో సాగు ఆధారాలను బట్టి చూస్తే కొంచెం అటుఇటుగా 3.06 లక్షల ఎకరాల్లో వ్యవసాయ భూమి ఉంది. అందులో లక్షా 15 వేల 200 ఎకరాల్లో వరి, 65 వేల 900 ఎకరాల్లో పత్తి, 24 వేల 144 ఎకరాల్లో మక, మిగతా భూమిలో ఇతర పంటలు సాగు చేస్తున్నారు.
పంట మొత్తంలో పొటాష్ ఎకరానికి ఒక బస్తా వేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన జిల్లా రైతులపై ఏటా 8 కోట్ల 41 లక్షల 15 వేల భారం పడనున్నది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని రైతులు కోరుతున్నారు. ఏడేండ్ల కిందట 670 ఉన్న పొటాష్ ధర 1800కు పెరగడం అన్యాయమని రైతులు వాపోతున్నారు. దీనికనుగుణంగా కేంద్రం పంటలకు మద్దతు ధర పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు ఇబ్బందే
అసలే కష్టంగా వ్యవసాయాన్ని నడిపిస్తున్నాం. ఈ పరిస్థితుల్లో పొటాష్ ధరను పెంచడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కంపెనీలు పునరాలోచించాలి. వ్యవసాయంలో దినదినం పెట్టుబడి విపరీతంగా పెరుగుతున్నది. కూలీ రేట్లు నాలుగేండ్లలోనే రెండింతలయ్యాయి. ఇప్పుడు పొటాష్ ధర పెరగడం రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్క బస్తాకు 275 పెరగడం చాలా దారుణం.
– బోడ మహేందర్‌రెడ్డి, మర్రివానిపల్లె (ఇల్లందకుంట మండలం)
మూలిగే నకపై తాటిపండు పడ్డ చందంగా మారింది రైతుల పరిస్థితి.. అసలే డీఏపీ, యూరియా కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రమంలో కేంద్రం పొటాష్ ధరను అమాంతంగా పెంచింది. మొన్నటి దాకా బస్తా ధర 1525 ఉండగా, ఇప్పుడు ఒక్కో బస్తాపై 275 పెంచి 1800 చేసింది.