ప్రజావాణి సమస్యలను పరిష్కరించాలి
Follow
జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుండి 86 అర్జీలను,జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు కలసి అర్జీలను స్వీకరించారు. సంబంధిత అధికారులు దరఖాస్తులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్నారు.
అందులో రెవిన్యూ శాఖ 54, జిల్లా పంచాయతీ శాఖ 8, జిల్లా వ్యవసాయ శాఖ 4, ఈ ఈ ఇరిగేషన్ 3, జిల్లా సంక్షేమ శాఖ 3, హౌసింగ్ 2, కోపరేటివ్ 2, విద్యాశాఖ 2, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ 2, ఎస్సీ కార్పొరేషన్ 2, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఎస్సీ సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ, ట్రైబల్ వెల్ఫేర్ సంక్షేమ శాఖ లకు ఒక్కొకటి చొప్పున వచ్చాయని తెలియజేశారు. వివిధ శాఖలకు వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిశీలించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శోభా రాణి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ,వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
The post ప్రజావాణి సమస్యలను పరిష్కరించాలి appeared first on Navatelangana.
జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి..నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుండి 86 అర్జీలను,జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి, జిల్లా స్థానిక సంస్థల
The post ప్రజావాణి సమస్యలను పరిష్కరించాలి appeared first on Navatelangana.