ప్రపంచం ‘వార్ మోడ్’లోకి.. అమెరికా, రష్యా, చైనా చేతిలో కొత్త ఆయుధాలు! భారత్ ఎలా సిద్ధమవుతోంది?

Follow

ప్రపంచంలోని అగ్రరాజ్యాలు తమ రక్షణ వ్యవస్థలను కొత్త టెక్నాలజీ తో మారుస్తూ, భవిష్యత్ యుద్ధాలకు సిద్ధమవుతున్నాయి.
1. ఇజ్రాయెల్: ‘ఐరన్ బీమ్’తో సరికొత్త రక్షణ కవచం
ఇరాన్‌తో ఘర్షణ తర్వాత తన రక్షణ వ్యవస్థలోని లోపాలను సరిదిద్దుకోవడంపై ఇజ్రాయెల్ పూర్తి దృష్టి పెట్టింది.
2. అమెరికా: అంతరిక్షం నుంచే దాడి!
ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు అమెరికా ఆధునిక టెక్నాలజీపై భారీగా ఖర్చు చేస్తోంది.
గోల్డెన్ డోమ్: ఇది అమెరికా బ్రహ్మాస్త్రం లాంటిది. శత్రు దేశాల హైపర్‌సోనిక్ క్షిపణులను అంతరిక్షం నుంచే గుర్తించి, వాటిని అక్కడే నాశనం చేసే అద్భుతమైన రక్షణ వ్యవస్థ.
3. రష్యా: అంతరిక్షంలో అణుబాంబు?
ప్రపంచంలోనే అత్యధికంగా 12,000 అణ్వాయుధాలు కలిగిన రష్యా, తన ఆయుధ సంపత్తిని మరింత పటిష్టం చేస్తోంది.
4. చైనా: దోమల సైజు డ్రోన్లు.. భారత్‌పై నిఘా!
పొరుగు దేశం చైనా, తన సైనిక సామర్థ్యాన్ని వేగంగా విస్తరిస్తోంది.
నిఘా కోసం దోమల పరిమాణంలో ఉండే చిన్న డ్రోన్లను అభివృద్ధి చేసింది. వీటిని గుర్తించడం దాదాపు అసాధ్యం.
5. ఇండియా: ఒకవైపు చైనా, మరోవైపు పాకిస్తాన్ నుంచి ముప్పు పొంచి ఉండటంతో, భారత్ ‘శాంతి కోసం యుద్ధానికి సిద్ధం’ అనే నినాదంతో ముందుకు వెళ్తోంది. ‘మేక్ ఇన్ ఇండియా’ లో భాగంగా సొంతంగా ఆయుధాలను తయారు చేసుకుంటూ ప్రపంచానికి తన శక్తిని చాటుతోంది.
పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి.
ప్రపంచం ఇప్పుడు నిప్పుల మీద నడుస్తోంది. రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధాలు కేవలం ఆరంభం మాత్రమేనా? చైనా-తైవాన్, కొరియాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు చూస్తుంటే ప్రపంచ దేశాలన్నీ “వార్ మోడ్”లోకి వెళ్లినట్లు కనిపిస్తోంది. ఈ భయానక వాతావరణంలో, ప్రతి దేశం తమ సైనిక శక్తిని పెంచుకునేందుకు పరుగులు పెడుతోంది. ఇంతకీ ఏ దేశం ఏ ఆయుధాన్ని సిద్ధం చేస్తోంది? మన భారత్ ఎంతవరకు సన్నద్ధంగా ఉంది?