ప్రభుత్వం ఎన్ని కష్టాల్లో ఉన్న పథకాలన్నీ అమలు చేస్తున్నాం: షబ్బీర్ అలీ

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

Shabbir Ali

నిజామాబాద్: ప్రభుత్వం అప్పుల కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తుందని ప్ఱభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) అన్నారు. నిజామాబాద్ పట్టణంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే ధనపాల్ సూర్య నారాయణతో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ (Shabbir Ali)  మాట్లాడుతూ.. ఆదివారం కళ్యాణ లక్ష్మి 130 మంది లబ్ధిదారులకు ఒక కోటి 60 లక్షల 18,560 రూపాయలను పంపిణీ చేస్తున్నామని, అలాగే షాదీ ముబారక్ 442 లబ్ధిదారులకు నాలుగు కోట్ల 12 లక్షల 47వేల 792 రూపాయలు అందించామని.. మొత్తం లబ్ధిదారులకు ఐదు కోట్ల 72 లక్షల 66,352 రూపాయలు అందించామని పేర్కొన్నారు.

ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులలో ఉన్న ఇచ్చిన మాట ప్రకారం పథకాలన్నీ అమలు చేస్తున్నామని తెలిపారు. రూ.500కు సిలిండర్, 200 యూనిట్ల వరకూ విద్యుత్ ఉచితంగా ఇస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఇందిరమ్మ ఇల్లు రైతు రుణమాఫీ, రైతు భరోసా, యువతకు ఉద్యోగాలు, రాజీవ్ యువ వికాసం పథకాలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు తహర్ బిన్ హందన్, కీరవత్రి అనిల్, మోహన్ రెడ్డి , నూడా చైర్మన్ కేశ వేణు, గ్రంధాలయ చైర్మన్ రాజి రెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

​నిజామాబాద్: ప్రభుత్వం అప్పుల కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తుందని ప్ఱభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) అన్నారు. నిజామాబాద్ పట్టణంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే ధనపాల్ సూర్య నారాయణతో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ (Shabbir Ali)  మాట్లాడుతూ.. ఆదివారం కళ్యాణ లక్ష్మి 130 మంది లబ్ధిదారులకు ఒక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *