ప్రభుత్వ అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో సమాచార శాఖదే కీలక పాత్ర

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

– ప్రత్యేక కమిషనర్‌ సీహెచ్‌ ప్రియాంక
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

ప్రభుత్వం చేపట్టిన అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో సమాచార పౌర సంబంధాల శాఖదే కీలక పాత్ర అని ప్రత్యేక కమిషనర్‌ సీహెచ్‌ ప్రియాంక అన్నారు. సమాచార శాఖ ప్రధాన కార్యాలయంలో పౌర సంబంధాల అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న ముళ్ళపూడి శ్రీనివాస్‌ కుమార్‌ సోమవారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ రాష్ట్ర సమాచార శాఖ కార్యాలయంలో శ్రీనివాస్‌కుమార్‌ను కార్యాలయ అధికారులు, ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక కమిషనర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలిచి ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేసేందుకు సమాచార శాఖ అధికారులు నిరంతరం కషి చేస్తున్నారన్నారు.

సమాచార శాఖ కార్యాలయంలో పీఆర్‌వో ముళ్ళపూడి శ్రీనివాస్‌కుమార్‌ తమ విధులను అంకితభావంతో సమర్థవంతంగా నిర్వర్తించారని ప్రత్యేక కమిషనర్‌ ప్రశంసించారు. ఉద్యోగ విరమణ మరొక కొత్త జీవితమని అన్నారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు వ్యక్తిగత జీవితాన్ని చాలా కోల్పోతామనీ, ఉద్యోగ విరమణ తర్వాత కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని అన్నారు. అనంతరం శ్రీనివాస్‌కుమార్‌ కుటుంబ సభ్యులను ప్రత్యేక కమిషనర్‌ పరిచయం చేసుకున్నారు. సమాచారశాఖ పీఆర్‌వో ముళ్ళపూడి శ్రీనివాస్‌కుమార్‌ మాట్లాడుతూ తన 38 ఏండ్ల ఉద్యోగ జీవితం సంతప్తిగా సాగిందన్నారు. అనేక పురస్కారాలు లభించాయన్నారు. చిత్తశుద్ధితో పనిచేయడం వల్ల సమాచార శాఖకు తాను చేసిన సేవల కంటే పొందినదే ఎక్కువ అని సంతప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి అదనపు సంచాలకులు డీఎస్‌.జగన్‌, సంయుక్త సంచాలకులు కె.వెంకటరమణ, వెంకటేశ్వరావు, ఉప సంచాలకులు మధుసూధన్‌, వై వెంకటేశ్వర్లు, ప్రసాద్‌, హష్మీ , సమాచార శాఖ అధికారులు , ఉద్యోగులు పాల్గొన్నారు.

The post ప్రభుత్వ అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో సమాచార శాఖదే కీలక పాత్ర appeared first on Navatelangana.

​– ప్రత్యేక కమిషనర్‌ సీహెచ్‌ ప్రియాంకనవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌ప్రభుత్వం చేపట్టిన అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో సమాచార పౌర సంబంధాల శాఖదే కీలక పాత్ర అని ప్రత్యేక కమిషనర్‌ సీహెచ్‌ ప్రియాంక అన్నారు. సమాచార శాఖ ప్రధాన కార్యాలయంలో పౌర సంబంధాల అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న ముళ్ళపూడి శ్రీనివాస్‌ కుమార్‌ సోమవారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ రాష్ట్ర సమాచార శాఖ కార్యాలయంలో శ్రీనివాస్‌కుమార్‌ను కార్యాలయ అధికారులు, ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ
The post ప్రభుత్వ అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో సమాచార శాఖదే కీలక పాత్ర appeared first on Navatelangana. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *