బంగ్లా భారీ స్కోరు

Follow

- తొలి ఇన్నింగ్స్‌లో 484/9
గాలె: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు.. 151 ఓవర్లలో 484/9 పరుగులు చేసింది. ఓవర్ నైట్ స్కోరు 292/3తో రెండో రోజు ఆట ఆరంభించిన బంగ్లా.. ఆరంభంలోనే కెప్టెన్ శాంతో (148) వికెట్ కోల్పోయినా అతడి స్థానంలో వచ్చిన లిటన్ దాస్ (90)తో కలిసి ముష్ఫీకర్ రహీమ్ (163) ఆ జట్టుకు భారీ స్కోరును అందించాడు.
ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 148 రన్స్ జోడించారు. కొద్దిసేపు వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో ముష్ఫీకర్‌ను అసిత ఫెర్నాండో ఎల్బీడబ్ల్యూటీ ఔట్ చేశాక.. బంగ్లా 26 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. ఫెర్నాండో, మిలాన్, తరిందుకు తలా 3 వికెట్లు దక్కాయి.
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు.. 151 ఓవర్లలో 484/9 పరుగులు చేసింది.