బల్దియాలో నకిలీ బర్త్, డెత్ సర్లిఫికెట్ల జారీ!

Follow

- తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్న కేంద్ర హోం శాఖ
- సమగ్ర నివేదిక ఇవ్వాలన్న ఇంటలిజెన్స్ బ్యూరో
సిటీబ్యూరో, జూన్ 18 (నమస్తే తెలంగాణ): జీహెచ్‌ఎంసీలో నకిలీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించింది. ఈమేరకు రాష్ట్రంలోని ఇంటలిజెన్స్ బ్యూరో అధికారులు జీహెచ్‌ఎంసీని అప్రమత్తం చేయడంతో పాటు బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీచేసినట్లు సమాచారం.
రోహింగ్యాలు, ఇతర దేశస్తులకు సంబంధించి ఇప్పటివరకు జారీ అయిన సర్టిఫికెట్లపై పూర్తి నివేదిక ఇవ్వాలని జీహెచ్‌ఎంసీని.. ఇంటలిజెన్స్ విభాగం ఆదేశించినట్లు తెలుస్తోంది. గ్రేటర్‌లోని పౌరులతో పాటు ఇతరులకు అక్రమంగా జనన, మరణ ధ్రువపత్రాలను జారీ చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీపై తీవ్రమైన ఆరోపణలున్నాయి. చార్మినార్, మెహిదీపట్నంతో పాటు పలు సర్కిళ్ల నుంచి సర్టిఫికెట్ల జారీలో దాదాపు 25వేలకు పైగా అక్రమ సర్టిఫికెట్లు జారీ అయ్యాయని గుర్తించిన అధికారులు.. వాటిని రద్దుచేశారు. ఇందులో వేల సంఖ్యలో డెత్ సర్టిఫికెట్లు సైతం ఉన్నాయి.
జీహెచ్‌ఎంసీలో నకిలీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించింది. ఈమేరకు రాష్ట్రంలోని ఇంటలిజెన్స్ బ్యూరో అధికారులు జీహెచ్‌ఎంసీని అప్రమత్తం చేయడంతో పాటు బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీచేసినట్లు సమాచారం.