బాకీ 28 లక్షలు.. వడ్డీ 43 లక్షలా.. జీహెచ్‌ఎంసీని నిలదీసిన హైకోర్టు

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
High Court

హైదరాబాద్‌, జూన్‌ 30 (నమస్తే తెలంగాణ) : అసలు పన్ను రూ.28 లక్ష లు, వడ్డీతో కలిపి రూ.71 లక్షలు.. ఇది ఏ ప్రాతిపదికన లెకకట్టారో చెప్పాలని హైకోర్టు జీహెచ్‌ఎంసీని నిలదీసింది. ఆస్తి యజమాని పన్ను కట్టి తీరాలని తేల్చి చెప్పింది. మూడు రోజుల్లో రూ.5 లక్షలు కట్టాలని ఆదేశించింది. తదుపరి విచారణ ను 16కు వాయిదా వేస్తూ జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. తమ ఫ్లాట్‌ 1,122 చదరపు అ డుగులు ఉండగా, 2,122 చదరపు అడుగులకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఆస్తి పన్ను విధిస్తున్నారని పేరొంటూ బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-5కు చెందిన మేరాజ్‌ అహ్మద్‌ సిద్దిఖీ హైకోర్టును ఆశ్రయించారు.

తన ఫ్లాట్‌ కొలతల ప్రకారం ఆస్తి పన్నును ఖరారుచేసేలా ఉత్తర్వు లు జారీచేయాలని కోరారు. దీనిపై జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కౌన్సిల్‌ ప్రతివాదన చేస్తూ.. సోమాజిగూడలోని వాణిజ్య భవనంలో ఈ ఫ్లాట్‌ ఉన్నదని తెలిపారు. పదకొండేండ్లుగా ఆ యజమాని ఆస్తి పన్ను కట్టలేదని చెప్పారు. రూ.71 లక్షలు పెండింగ్‌ ఉన్నదని అన్నారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు విన్న తర్వాత న్యాయ మూర్తి స్పందిస్తూ హైదరాబాద్‌లోని ఎగవేతదారులతో లండన్‌ సూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌, కేంబ్రిడ్జ్‌లాంటి వర్సిటీల్లో తరగతులు చెప్పించాలి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. వడ్డీ లెక లు ఎలా చేశారో చెప్పాలని జీహెచ్‌ఎంసీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.

​అసలు పన్ను రూ.28 లక్ష లు, వడ్డీతో కలిపి రూ.71 లక్షలు.. ఇది ఏ ప్రాతిపదికన లెకకట్టారో చెప్పాలని హైకోర్టు జీహెచ్‌ఎంసీని నిలదీసింది. ఆస్తి యజమాని పన్ను కట్టి తీరాలని తేల్చి చెప్పింది. మూడు రోజుల్లో రూ.5 లక్షలు కట్టాలని ఆదేశించింది. తదుపరి విచారణ ను 16కు వాయిదా వేస్తూ జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *