బీఆర్‌ఎస్‌ జెండా గద్దె కూల్చివేత

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
01

నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని షేక్‌షాహెబ్‌పేట్‌లో బీఆర్‌ఎస్‌ జెండా గద్దెను ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేశారు. విషయం తెలుసుకున్న పార్టీ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, కార్యకర్తలు అక్కడికి చేరుకుని, పట్టణ పోలీసులకు సమాచారం అందించగా సీఐ ప్రవీణ్‌కుమార్‌ వచ్చి గద్దెను పరిశీలించారు. గద్దెను కూల్చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ శ్రేణులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

-నిర్మల్‌ అర్బన్‌

జీవో 49 రద్దుచేయాలని ఆదివాసీల ధర్నా

ఆదివాసీలను అడవినుంచి వెళ్లగొట్టేందుకు తీసుకొచ్చిన జీవో 49ను రద్దు చేయాలని డిమాండ్‌చేస్తూ తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో భద్రాద్రికొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఈబయ్యారం క్రాస్‌రోడ్‌లో ఆదివాసీలు సోమవారం ధర్నాచేపట్టారు. ఈ సందర్భంగా సంఘం మండల అధ్యక్షుడు దుబ్బా గోవర్ధన్‌ మాట్లాడుతూ అడవులను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు.

– పినపాక

​నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని షేక్‌షాహెబ్‌పేట్‌లో బీఆర్‌ఎస్‌ జెండా గద్దెను ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేశారు. విషయం తెలుసుకున్న పార్టీ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, కార్యకర్తలు అక్కడికి చేరుకుని, పట్టణ పోలీసులకు సమాచారం అందించగా సీఐ ప్రవీణ్‌కుమార్‌ వచ్చి గద్దెను పరిశీలించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *