బీజేపీ బీసీ ద్రోహుల పార్టీ..

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వకుండా నట్టేట ముంచింది
జాతీయ – బీసీ సంక్షేమ సంఘం భూపాలపల్లి  జిల్లా  ఇన్చార్జి విజయ గిరి సమ్మయ్య వెల్లడి
నవతెలంగాణ – మల్హర్ రావు 
: తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీలకు ఇస్తామని ఊరడించి, ఊరించి, చివరికి బీజేపీ బీసీలను మోసం చేసిందని జాతీయ బీసీ సంఘం భూపాలపల్లి జిల్లా ఇంచార్జి విజయ గిరి సమ్మయ్య అన్నారు. 60 శాతం జనాభా ఉన్న బీసీలను కాదని ఒక శాతం ఉన్న అగ్రకుల సామాజిక వర్గానికి పార్టీ అధ్యక్షులుగా బీజేపీ కట్టబెట్టి బీసీలను దగా చేసిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. మంగళవారం కొయ్యూరు ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు బీసీల జపం చేస్తుంటే బీజేపీ మాత్రం అగ్రకులాల జపం చేస్తుందన్నారు.

60 శాతం ఉన్న బీసీలను కాదని, ఒక శాతం ఉన్న  బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన రామచందర్ రావుకు రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే బీజేపీ వచ్చే ఎన్నికలలో ఘోర పరాజయం చవి చూడక తప్పదన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీని సీఎం చేస్తానన్న బీజేపీ, చివరికి ఫ్లోర్ లీడర్ గా కూడా అగ్రకులానికి చెందిన మహేశ్వర్ రెడ్డికి కట్టబెట్టి, బీజేపీ మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన లేదని రుజువు చేసుకుందన్నారు. పార్టీ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వని పార్టీ, రాబోయో భవిష్యత్తులో బీసీనీ సీఎం చేస్తానంటే బీజేపీని బీసీలు ఎలా నమ్ముతారని నిలదీశారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలపకుండా గత మూడు నెలలుగా తొక్కి పెడుతుందని అన్నారు.

ఇప్పుడు  బీసీలకు రాష్ట్ర పగ్గాలు ఇవ్వకుండా బీజేపీ ప బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని ఆయన మండిపడ్డారు. బీజేపీ అంటే ఇప్పుడు తెలంగాణలో బ్రాహ్మణ జనతా పార్టీగా రామచందర్ రావు నియామకంతో మారిపోయిందని, బీజేపీలో అగ్రకులాలకు ఉన్న విలువ బీసీలకు లేదని ఈ నియామకంతో తేలిపోయిందన్నారు. బీజేపీలో అగ్రకుల హిందువులకు ఒక న్యాయం, బీసీ హిందువులకు ఇంకొక న్యాయo చేస్తున్నారని అన్నారు.

బీసీ హిందువులపై బీజేపీలో వివక్షత చూపిస్తుందనాడనికి బీసీ హిందువులకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వకపోవడమే నిదర్శనమన్నారు.బీజేపీలో ఎంతోమంది బీసీలు పార్టీ అధ్యక్ష పదవికి అర్హులు ఉన్నప్పటికీ, వారికి బీసీ కులమే అనర్హతగా మారిందన్నారు. బీసీలను మోసం చేసిన బీజేపీని, ఈరోజు నుండి బీసీల ద్రోహుల పార్టీగా ప్రకటిస్తున్నామని, ఆ పార్టీలో ఉన్న బీసీ నేతలు ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా వెంటనే బీజేపీకి రాజీనామా చేసి బయటికి రావాలని ఆయన సూచించారు. బీసీలను అవమానించిన బీజేపీకి బీసీల బలమేంటో త్వరలోనే రుచి చూపించి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

The post బీజేపీ బీసీ ద్రోహుల పార్టీ.. appeared first on Navatelangana.

​రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వకుండా నట్టేట ముంచిందిజాతీయ – బీసీ సంక్షేమ సంఘం భూపాలపల్లి  జిల్లా  ఇన్చార్జి విజయ గిరి సమ్మయ్య వెల్లడినవతెలంగాణ – మల్హర్ రావు : తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీలకు ఇస్తామని ఊరడించి, ఊరించి, చివరికి బీజేపీ బీసీలను మోసం చేసిందని జాతీయ బీసీ సంఘం భూపాలపల్లి జిల్లా ఇంచార్జి విజయ గిరి సమ్మయ్య అన్నారు. 60 శాతం జనాభా ఉన్న బీసీలను కాదని ఒక శాతం ఉన్న అగ్రకుల సామాజిక వర్గానికి
The post బీజేపీ బీసీ ద్రోహుల పార్టీ.. appeared first on Navatelangana. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *