బెల్ట్‌ షాపులు బంద్‌ చేస్తరా లేదా?

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Womens

సిరిసిల్ల రూరల్‌, జూన్‌ 30: ‘మా కాలనీలోని రెండు షెట్టర్లలో ఏర్పాటు చేసిన బెల్టు షాపులతో అనేక ఇబ్బందులు పడుతున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చంద్రంపేటకు చెందిన వడ్డెరకాలనీ మహిళలు ఆందోళన వ్యక్తంచేశారు. సోమవారం వారు సిరిసిల్ల పోలీసుస్టేషన్‌కు తరలివచ్చి నిరసన తెలిపారు. వెంటనే బెల్ట్‌ షాపులను తొలగించాలని డిమాండ్‌ చేశారు.

కొందరు వ్యక్తులు ఇక్కడ మద్యం తాగి నానా హంగామా చేస్తూ తమను వేధింపులకు గురిచేస్తున్నారని, ఫలితంగా నిత్యం మానసిక క్షోభ అనుభవిస్తున్నామని తెలిపారు. బెల్ట్‌షాపులను తొలగించకపోతే తాము చావడానికైనా అనుమతించాలని పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారులను వేడుకున్నారు.

​‘మా కాలనీలోని రెండు షెట్టర్లలో ఏర్పాటు చేసిన బెల్టు షాపులతో అనేక ఇబ్బందులు పడుతున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చంద్రంపేటకు చెందిన వడ్డెరకాలనీ మహిళలు ఆందోళన వ్యక్తంచేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *