భాగ్యనగరిలో ‘పెద్ది’ పోరాటాలు

Follow

రామ్‌చరణ్ నటిస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ నిర్మాణం నుంచే దేశవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ చేస్తున్నది. ముఖ్యంగా ఫస్ట్‌గ్లింప్స్ ఒక్కసారి సినిమాపై అంచనాల్ని పెంచింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో యాక్షన్ ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ఇందులో ట్రైన్ సెట్‌ను తీర్చిదిద్దారు కళా దర్శకుడు అవినాష్ కొల్లా.
రామ్‌చరణ్ రిస్కీ స్టంట్స్ చేస్తున్నారని, ‘పుష్ప-2’తో పేరుపొందిన యాక్షన్ కొరియోగ్రాఫర్ నబాకాంత్ ఈ ఫైట్ సీక్వెన్స్‌కు రూపకల్పన చేశారని చిత్రబృందం పేర్కొంది. భారతీయ సినీ చరిత్రలో యాక్షన్ పరంగా కొత్త ప్రమాణాలను నిర్ధేశిస్తూ ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను తెరకెక్కిస్తున్నామని నిర్మాతలు తెలిపారు. క్రికెట్, మల్లయుద్ధంతో పాటు మరికొన్ని గ్రామీణ క్రీడల నేపథ్యంలో యాక్షన్‌గా డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న విడుదలకానుంది. జాన్వీకపూర్, శివరాజ్‌కుమార్, జగపతిబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్, రచన-దర్శకత్వం: బుచ్చిబాబు సానా.
రామ్‌చరణ్ నటిస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ నిర్మాణం నుంచే దేశవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ చేస్తున్నది. ముఖ్యంగా ఫస్ట్‌గ్లింప్స్ ఒక్కసారి సినిమాపై అంచనాల్ని పెంచింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.