భారత్ ప్రతిష్టను దిగజారుస్తున్న మోడీ
Follow
– దిగుమతి సుంకాలు..
– పాలస్తీనా విషయంలో రాజీ ధోరణి
– తెలంగాణలో బీజేపీ గెలుస్తుందనడం హాస్యాస్పదం : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రపంచంలో భారత్ పరువు, ప్రతిష్టలను కేంద్ర ప్రభుత్వం మంటగల్పుతోందని, ప్రధాని మోడీ ట్రంప్ బెదిరింపులకు జీ హుజూర్ అంటున్నారని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య అన్నారు. భారత దేశానికి ఒకప్పుడు అలీనోద్యమాన్ని నడిపిన చరిత్ర ఉందని, మోడీ ప్రధాని అయ్యాక భారత్ పరువును పల్చన చేస్తున్నారని దుయ్యబట్టారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ విషయంలో తాను బెదిరించడం వల్లనే రెండు దేశాలు రాజీకి వచ్చాయని ట్రంప్ ప్రకటన చేయడంతో భారత్‌కు మర్యాద లేకుండా పోయిందన్నారు. అలాగే, అమెరికా నుంచి భారత్ విద్యార్థులను చేతులకు సంకెళ్లు వేసి తరిమేసిన విషయంలోనూ మోడీ ట్రంప్‌తో మాట్లాడకుండా ఆయనతో చర్చలు జరిపి అదానీపై కేసులు పెట్టకుండా మాట్లాడుకున్నారని ఆరోపించారు. సరుకుల దిగుమతి విషయంలోనూ ఇండియా పన్నులు తగ్గించాలని ట్రంప్ డిమాండ్ చేస్తే మోడీ ఆటోమొబైల్స్ వస్తువులపై సుంకాల్ని తగ్గించిందన్నారు. ఇజ్రాయిల్ పాలస్తీనాపై దాడులు చేస్తుంటే మోడీ ఇజ్రాయిల్‌తో దోస్తీ చేస్తున్నారని, గతంలో భారత్ ఎప్పుడైనా పాలస్తీనాకే మద్దతు తెలిపిందనీ, బీజేపీ ప్రధానిగా ఉన్న వాజ్‌పేరు కూడా అదే వైఖరి అనుసరించారని గుర్తు చేశారు. ఇరాన్ ప్రభుత్వానికి ఉన్న ధైర్యం ప్రధాని మోడీకి ఈసమెత్తు కూడా లేదని తెలిపారు.
ప్రభుత్వ సభను రాజకీయ వేదిక చేయడం తప్పు
పసుపుబోర్డు కార్యాలయం ప్రారంభం పేరిట నిర్వహించిన ప్రభుత్వ అధికారిక సభను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తమ పార్టీ రాజకీయ వేదికగా మార్చుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం సబబు కాదని వీరయ్య అన్నారు. బీఆర్‌ఎస్ మాదిరే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూడా రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందంటూ, తెలంగాణ ఢిల్లీ కాంగ్రెస్‌కు ఏటీఎంగా మారిందని విమర్శించడం దారుణమన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సున్నితంగా స్పందించినప్పటికీ సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం అమిత్‌షా విమర్శలపై స్పందించాల్సిన అవసరముందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. పసుపు బోర్డును మూడు సార్లు ప్రారంభించడం విడ్డూరంగా ఉందన్నారు. 11 ఏండ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వానికి పసుపు బోర్డు గుర్తుకు వచ్చిందనీ, ఇన్నాళ్లు రైతులు చేసిన పోరాట ఫలితంగానే బోర్డు వచ్చిందని అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.నర్సింహులు, జిల్లా కమటీ సభ్యులు కృష్ణ పాల్గొన్నారు.
The post భారత్ ప్రతిష్టను దిగజారుస్తున్న మోడీ appeared first on Navatelangana.
– దిగుమతి సుంకాలు..– పాలస్తీనా విషయంలో రాజీ ధోరణి– తెలంగాణలో బీజేపీ గెలుస్తుందనడం హాస్యాస్పదం : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్యనవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధిప్రపంచంలో భారత్ పరువు, ప్రతిష్టలను కేంద్ర ప్రభుత్వం మంటగల్పుతోందని, ప్రధాని మోడీ ట్రంప్ బెదిరింపులకు జీ హుజూర్ అంటున్నారని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య అన్నారు. భారత దేశానికి ఒకప్పుడు అలీనోద్యమాన్ని నడిపిన చరిత్ర ఉందని, మోడీ ప్రధాని అయ్యాక భారత్ పరువును పల్చన చేస్తున్నారని దుయ్యబట్టారు. సోమవారం సంగారెడ్డి
The post భారత్ ప్రతిష్టను దిగజారుస్తున్న మోడీ appeared first on Navatelangana.