మహబూబూబాద్ జిల్లా : భూమి గొడవలో అన్నను చంపిన తమ్ముళ్లు​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

మహబూబూబాద్ జిల్లా : భూమి గొడవలో అన్నను చంపిన తమ్ముళ్లు

Caption of Image.

కురవి (సీరోలు) వెలుగు : భూ గొడవలో సొంత అన్నను తమ్ముళ్లు కత్తితో పొడిచి చంపిన ఘటన మహబూబూబాద్ జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. సీరోలు మండల కేంద్రానికి చెందిన వల్లపు లింగయ్యకు ఇద్దరు భార్యలు. కాగా.. పెద్ద భార్య మాణిక్యమ్మకు కొడుకు కృష్ణ, కూతుళ్లు రమణ, ప్రమీల వినోద ఉన్నారు. చిన్న భార్య నర్సమ్మకు ఇద్దరు కొడుకులు నరేశ్, మహేశ్​ఉన్నారు. లింగయ్యకు 16 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా..  ముగ్గురు కొడుకులకు పంచాడు. కూతురు రమణకు ఒక ఎకరం రాసిచ్చాడు.  ఆ భూమి కోసం తండ్రి, అన్నతో నాలుగేండ్లుగా తమ్ముళ్లు గొడవ పడుతున్నారు. తన వాటా భూమిని కౌలుకు ఇచ్చి కొంతకాలంగా కృష్ణ హైదరాబాద్ లో ఉంటున్నాడు. 

బుధవారం కృష్ణ సొంతూరు వెళ్లాడు. ఇక నుంచి తనే భూమిని సాగు చేసుకుంటానని పనులు చేపట్టగా.. ఇద్దరు తమ్ముళ్లు తమ కుటుంబసభ్యులతో వెళ్లారు. తండ్రి ముందే అన్న కృష్ణతో గొడవపడి తమ్ముళ్లు కత్తితో పొడిచి చంపేశారు. పోలీసులకు సమాచారం అందడంతో ఘటన స్థలానికి వెళ్లి విచారణ చేశారు. ఘటనపై సీరోలు పోలీసులను వివరణ కోరగా.. తమకు ఫిర్యాదు అందలేదని తెలిపారు. అందిన వెంటనే కేసు నమోదు చేస్తామని చెప్పారు.

©️ VIL Media Pvt Ltd.

​మహబూబూబాద్ జిల్లా : భూమి గొడవలో అన్నను చంపిన తమ్ముళ్లు  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *