మహిళా శిశు సంక్షేమ శాఖకు అదనపు నిధులివ్వండి

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

– కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవికి రాష్ట్ర మంత్రి సీతక్క విజ్ఞప్తి
– వినూత్న పథకాలు అమలు చేస్తున్నారంటూ కేంద్ర మంత్రి ప్రశంస
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

తెలంగాణలో అమలు చేస్తున్న పథకాల కోసం మహిళా శిశుసంక్షేమ శాఖకు అదనపు నిధులివ్వాలని కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవిని రాష్ట్ర మంత్రి డాక్టర్‌ ధనసరి అనసూయ(సీతక్క) విజ్ఞప్తి చేశారు. సోమవారం శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవితో మంత్రి సీతక్క, రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాల వివరాలను అందజేశారు. ఆరోగ్యలక్ష్మి, పోషణ్‌ 2.0, సంక్షేమ అంగన్వాడీ వంటి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు వెచ్చిస్తోందని సీతక్క తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా అంగన్వాడీ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ ప్రయోజనాలు కల్పిస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రికి వివరిం చారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల జీతాల్లో కేంద్ర వాటాను పెంచాలని కోరారు. అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ. 10,950, రూ.6450 చెల్లిస్తుండగా కేంద్రం తన వాటాగా నామమాత్రంగా కేవలం రూ. 2700, రూ.1350 మాత్రమే చెల్లిస్తుందని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఈ మొత్తాన్ని పెంచాలని విన్నవించారు. దీంతోపాటు రాష్ట్రంలో 11 వేలకుపైగా అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయనీ, వాటికి సొంత భవనాల నిర్మాణానికి కేంద్ర నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా గర్భిణీలకు, బాలింతలకు ప్రతిరోజు 200 ఎమ్‌ఎల్‌ పాలు అందిస్తున్నామనీ, త్వరలో చిన్నారులకు సైతం ఈ పథకాన్ని వర్తింపజేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందనీ, కేంద్ర ప్రభుత్వం తన వంతు సహకారం అందించాలని సీతక్క కోరారు. దీనికి కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి సానుకూలంగా స్పందించారు. తెలంగాణలో చేపడుతున్న పథకాలను అభినందించారు. అన్ని రాష్ట్రాల మహిళా శిశు సంక్షేమ మంత్రులు, అధికారులతో కలిసి తెలంగాణలో జాతీయ సదస్సు నిర్వహించి ఇక్కడి బెస్ట్‌ ప్రాక్టీస్‌ను ఇతర రాష్ట్రాలకు పరిచయం చేస్తామని తెలిపారు. కేంద్ర క్యాబినెట్‌లో చర్చించి అధిక నిధుల మంజూరుపై నిర్ణయం తీసుకుంటామని హామీనిచ్చారు.

The post మహిళా శిశు సంక్షేమ శాఖకు అదనపు నిధులివ్వండి appeared first on Navatelangana.

​– కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవికి రాష్ట్ర మంత్రి సీతక్క విజ్ఞప్తి– వినూత్న పథకాలు అమలు చేస్తున్నారంటూ కేంద్ర మంత్రి ప్రశంసనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌తెలంగాణలో అమలు చేస్తున్న పథకాల కోసం మహిళా శిశుసంక్షేమ శాఖకు అదనపు నిధులివ్వాలని కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవిని రాష్ట్ర మంత్రి డాక్టర్‌ ధనసరి అనసూయ(సీతక్క) విజ్ఞప్తి చేశారు. సోమవారం శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవితో మంత్రి సీతక్క, రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్‌
The post మహిళా శిశు సంక్షేమ శాఖకు అదనపు నిధులివ్వండి appeared first on Navatelangana. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *