మాదకద్రవ్యాల వినియోగంతో.. భవిష్యత్తు అంధకారం

Follow

వినాయక్ నగర్, జూన్ 18: మాదకద్రవ్యాల వినియోగంతో జీవితం అంధకారమవుతుందని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మి అన్నారు. యువత భవిష్యత్తు బాగుండాలంటే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం (జూన్ 26) నేపథ్యంలో జిల్లా న్యాయసేవా అధికార సంస్థ రూపొందించిన ‘జీవితంలో డ్రగ్స్ కు నో చెప్పడం ఎలా?’ అనే పోస్టర్లను జిల్లా కోర్టు ప్రాంగణంలోని తన చాంబర్‌లో సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు, అదనపు డీసీపీ బస్వారెడ్డితో కలిసి బుధవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. 2025 సంవత్సరంలో డ్రగ్స్ నివారణ, చికిత్సపై న్యాయ వ్యవస్థ దృష్టి సారిస్తుందని తెలిపారు. విద్యార్థులు, యువత, ప్రజలు మాదక ద్రవ్యాలను అలవాటు చేసుకోరాదని సూచించారు. యువతరం దేశ అభివృద్ధి, ప్రగతికి తమ మేధస్సుతో ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ నెల 26న జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవా సదన్‌లో విద్యార్థులు, యువతతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
మాదకద్రవ్యాల వినియోగంతో జీవితం అంధకారమవుతుందని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మి అన్నారు. యువత భవిష్యత్తు బాగుండాలంటే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.